సైదాబాద్ కీచకుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆరేళ్ల చిన్నారి చైత్రపై అత్యాచారానికి పాల్పడి.. అత్యంత దారుణంగా హత్య చేసి తప్పించుకుని తిరుగుతున్న రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కూడా అది రాజు డెడ్ బాడీ అని తెలిపారు. ఘట్కేసర్ నుంచి వరంగల్ వెళ్లే రైల్వే ట్రాక్ పై అతని డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు.
సైదాబాద్ సింగరేణి కాలనీ రేప్ కేస్ ఘటన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు పోలీసులు. ఘట్కేసర్- వరంగల్ రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహం పడి ఉన్నట్టు గమనించారు పోలీసులు. వరంగల్ జిల్లాలోని నష్‌కల్ రైల్వేట్రాక్‌పై రాజు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. చేతిపై ఉన్న టాటూను చూసి నిందితుడు రాజును పోలీసులు గుర్తించారు. సైదాబాద్ కేసు నిందితుడు రాజు డెడ్ బాడీ స్టేషన్ ఘన్‌పూర్ రైల్వే ట్రాక్‌పై పడి ఉందనే సమాచారంతో స్పాట్‌కి వెళ్లారు పోలీసులు. రాజు చేతిపై ఉన్న ‘మౌనిక’ టాటూను చూసి అతనేనని కన్‌ఫామ్ చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు అధికార ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.
సెప్టెంబరు 9న సింగరేణి కాలనీలోని ఆరేళ్ల బాలిక అదృశ్యమైంది. చిన్నారి తల్లిదండ్రులు నల్లగొండ జిల్లా దేవరకొండ సమీప తండాకు చెందిన గిరిజన కుటుంబం. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి సింగరేణి కాలనీలో నివసిస్తోంది. చివరకు ఆమె నివసించే పక్కింట్లో ఉండే రాజు అనే యువకుడి ఇంట్లో ఆమె మృతదేహం లభ్యమైంది. అప్పటికే రాజు ఆ ఇల్లు వదిలి పారిపోయాడు. బాలికపై రాజు అత్యాచారానికి పాల్పడి, ఆ తర్వాత చంపేసి, అక్కడి నుంచి పారిపోయాడని స్థానికులు ఆరోపించారు. రాజు గురించి సమాచారం అందిస్తే రూ.10 లక్షలు ఇస్తామని పోలీసులు ప్రకటన చేశారు. బాలిక తల్లిదండ్రులను తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ పరామర్శించారు. వారిని ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. మంత్రులు బాలిక ఇంటికి వచ్చి వెళ్లిన కొద్ది సేపటికే రాజు మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై గుర్తించామని పోలీసులు ప్రకటించారు.