More

  సాయి పల్లవికి షాకిచ్చిన హైకోర్టు

  సాయి ప‌ల్ల‌వికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఓ కేసులో విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ త‌న‌కు జారీ చేసిన నోటీసుల‌ను ర‌ద్దు చేయాలంటూ సాయిప‌ల్ల‌వి దాఖలు చేసిన క్వాష్ పిటిష‌న్‌ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. ఇటీవల ఆమె క‌శ్మీరీ పండిట్ల హ‌త్య‌లు, గో హ‌త్య‌ల‌పై చేసిన వ్యాఖ్యలపై భ‌జ‌రంగ్ ద‌ళ్ నేత‌లు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సుల్తాన్‌బ‌జార్ పోలీస్ స్టేష‌న్‌లో సాయి ప‌ల్ల‌విపై కేసు న‌మోదు అయింది. ఈ కేసులో సాయి ప‌ల్లవికి సుల్తాన్ బ‌జార్ పోలీసులు గ‌త నెల 21న నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల‌ను ర‌ద్దు చేయాలంటూ సాయి ప‌ల్ల‌వి తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌పై గురువారం విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు పోలీసుల నోటీసులను ర‌ద్దు చేసేందుకు నిరాక‌రించింది. సాయి ప‌ల్ల‌వి అభ్య‌ర్థ‌న‌ను తిర‌స్క‌రిస్తూ ఆమె పిటిష‌న్‌ను కొట్టేసింది.

  వివాదాస్పద వ్యాఖ్యలు:

  కశ్మీర్ పండిట్లపై దారుణ అకృత్యాలకు పాల్పడిన వారిని.. గోవధ కోసం ఆవుల అక్రమరవాణాకు పాల్పడేవారిని అడ్డుకున్న గోసంరక్షకులను ఒకే గాటన కడుతూ హీరోయిన్ సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. మతోన్మాదంతో పండిట్లపై మారణకాండ సృష్టించడం… ధర్మం కోసం దైవసమానమైన గోవులను కాపాడుకునేందుకు గోరక్షకులు చేసే పోరాటం ఒకటే ఎలా అవుతాయో చెప్పాలని పలువురు డిమాండ్ చేశారు.

  అప్పట్లోనే వివరణ ఇచ్చిన సాయి పల్లవి:

  తాజాగా సాయిపల్లవి ఈ వివాదంపై స్పందించారు. అందుకు సంబంధించి ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని.. తాను మాట్లాడిన మాటల్లో కొన్నింటినే పరిగణనలోకి తీసుకుని తప్పుడు ప్రచారం చేశారని వెల్లడించారు. మీరు రైట్ వింగ్ కు మద్దతు ఇస్తారా? లెఫ్ట్ వింగ్ కు మద్దతు ఇస్తారా? అని ప్రశ్నించారని, ముందు మనం మంచి మనుషులుగా జీవించాలన్న ఉద్దేశం వచ్చేట్టు సమాధానం ఇచ్చానని సాయిపల్లవి స్పష్టం చేశారు. హింస అనేది ఏ రూపంలో ఉన్నా దాన్ని ఖండించాల్సిందేనని.. తాను మొదట ఓ డాక్టర్ నని, ప్రాణం విలువ తనకు తెలుసని అన్నారు. ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదని స్పష్టం చేశారు. ఏదేమైనా తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే అందుకు తనను క్షమించాలని అన్నారు. ఇలా నేను మీ ముందుకు వచ్చి ఓ విషయం మీద క్లారిటీ ఇవ్వడం మొదటి సారి జరుగుతోంది. మాట్లాడే ముందు ఇలా ఒకటికి రెండు సార్లు ఆలోచించడం కూడా బహుశా ఇదే మొదటి సారి.. ఎందుకంటే నేను మాట్లాడిన మాటలు తప్పుగా అందరికీ అర్థమయ్యాయన్నారు సాయి పల్లవి. ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాను చూసిన తరువాత దర్శకుడికి ఫోన్ చేశాను. మాట్లాడాను. ఇదంతా మూడు నెలల క్రితం జరిగింది. సినిమా చూసి ఎంతో బాధగా అనిపించింది.. ఈ జీనోసైడ్ వల్ల ఇంకా కొన్ని తరాలు బాధపడుతూనే ఉన్నాయి. ఇక మాబ్ లించింగ్ (మూకహత్య) వీడియో చూసి షేక్ అయ్యాను. ఎంతో బాధగా అనిపించింది. హింస అనేది ఏ రూపంలో ఉన్నా కూడా తప్పే.. మతాల పేరిట చేసే హింస మహా పాపం.. ఇదే నేను చెప్పాలనుకున్నది. నా ఉద్దేశ్యం అదేనని ఆమె వివరణ ఇచ్చారు.

  spot_img

  Trending Stories

  Related Stories