More

    తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటున్న సాయి పల్లవి

    నటి సాయిపల్లవి ఇటీవల కశ్మీరీ పండిట్ల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే..! సాయిపల్లవిని చాలా మంది తీవ్రంగా విమర్శించారు. తాజాగా సాయిపల్లవి ఈ వివాదంపై స్పందించారు. అందుకు సంబంధించి ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని.. తాను మాట్లాడిన మాటల్లో కొన్నింటినే పరిగణనలోకి తీసుకుని తప్పుడు ప్రచారం చేశారని వెల్లడించారు. మీరు రైట్ వింగ్ కు మద్దతు ఇస్తారా? లెఫ్ట్ వింగ్ కు మద్దతు ఇస్తారా? అని ప్రశ్నించారని, ముందు మనం మంచి మనుషులుగా జీవించాలన్న ఉద్దేశం వచ్చేట్టు సమాధానం ఇచ్చానని సాయిపల్లవి స్పష్టం చేశారు. హింస అనేది ఏ రూపంలో ఉన్నా దాన్ని ఖండించాల్సిందేనని.. తాను మొదట ఓ డాక్టర్ నని, ప్రాణం విలువ తనకు తెలుసని అన్నారు. ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదని స్పష్టం చేశారు. ఏదేమైనా తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే అందుకు తనను క్షమించాలని అన్నారు.

    ఇలా నేను మీ ముందుకు వచ్చి ఓ విషయం మీద క్లారిటీ ఇవ్వడం మొదటి సారి జరుగుతోంది. మాట్లాడే ముందు ఇలా ఒకటికి రెండు సార్లు ఆలోచించడం కూడా బహుశా ఇదే మొదటి సారి.. ఎందుకంటే నేను మాట్లాడిన మాటలు తప్పుగా అందరికీ అర్థమయ్యాయన్నారు సాయి పల్లవి. ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాను చూసిన తరువాత దర్శకుడికి ఫోన్ చేశాను. మాట్లాడాను. ఇదంతా మూడు నెలల క్రితం జరిగింది. సినిమా చూసి ఎంతో బాధగా అనిపించింది.. ఈ జీనోసైడ్ వల్ల ఇంకా కొన్ని తరాలు బాధపడుతూనే ఉన్నాయి. ఇక మాబ్ లించింగ్ (మూకహత్య) వీడియో చూసి షేక్ అయ్యాను. ఎంతో బాధగా అనిపించింది. హింస అనేది ఏ రూపంలో ఉన్నా కూడా తప్పే.. మతాల పేరిట చేసే హింస మహా పాపం.. ఇదే నేను చెప్పాలనుకున్నది. నా ఉద్దేశ్యం అదేనని ఆమె వివరణ ఇచ్చారు.

    spot_img

    Trending Stories

    Related Stories