Telugu States

సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై అపోలో ఆసుపత్రి ప్రకటన..!

టాలీవుడ్ నటుడు సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు తెలిపారు. ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ కుడి కంటి భాగంతో పాటు చాతీ భాగంలోనూ గాయాలయ్యాయని తెలిపారు. కాలర్ బోన్ విరగడం మినహా శరీరంలో అంతర్గత గాయాలేవీ లేవని తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని.. మరో 48 గంటలపాటు వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు. సాయిధరమ్ తేజ్ రేపు మాట్లాడే అవకాశం ఉందని వివరించారు.

Image

సాయిధరమ్ తేజ్‌పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదైంది. రాత్రి 8.05 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్టు అక్కడి సీసీ టీవీ ఫుటేజీల్లో నమోదైంది. దీని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదంపై 108 సిబ్బంది తమకు సమాచారం అందించినట్టు చెప్పిన పోలీసులు ఘటనా స్థలం నుంచి స్పోర్ట్స్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. బైక్‌పై వేగంగా వెళ్తుండడంతో నియంత్రించలేక అదుపుతప్పి కిందపడినట్టు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో సాయిధరమ్ తేజ్ హెల్మెట్ పెట్టుకునే ఉన్నారని మాదాపూర్ డీసీపీ తెలిపారు.

Image

సాయి తేజ్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. సాయి మద్యం తాగి డ్రైవ్ చేయలేదని, ప్రమాద సమయంలో హెల్మెట్ ధరించే ఉన్నాడని తెలిపారు. రోడ్డుపై ఇసుక ఉండడంతో బండి జారి ప్రమాదం జరిగిందని వివరించారు. అల్లు అరవింద్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. సాయితేజ్ సేఫ్‌గానే ఉన్నాడని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా రాత్రి సాయి ధరమ్ తేజ్ ను చూడడానికి వచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four × 4 =

Back to top button