నేడు తెరచుకోనున్న శబరిమల ఆలయం

0
689

కేరళలోని శబరిమల ఆలయం నేడు తెరచుకోనుంది. మలయాళ మాసం కుంభం కారణంగా ఐదు రోజుల పూజ కోసం శనివారం నుండి భక్తుల కోసం తిరిగి తెరవబడుతుంది. పలు రాష్ట్రాలకు చెందిన భక్తులు అయ్యప్పను దర్శనం చేసుకోనున్నారు. ఆలయ ట్రస్ట్ ఇచ్చిన సమాచారం ప్రకారం, ఆలయంలోని శ్రీకోవిల్ ని తంత్రి మహేశ్ మోహనరావు సమక్షంలో మేల్శాంతి పరమేశ్వరన్ నంపూతిరి సాయంత్రం 5.30 గంటలకు తెరుస్తారు. ఆ రోజు ఆలయంలో ఎలాంటి పూజలు నిర్వహించరు.

ఐదు రోజుల పూజా కార్యక్రమాలలో భాగంగా రోజుకు 15,000 మంది భక్తులను వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా దర్శనం కోసం అనుమతించనున్నారు. RT-PCR పరీక్షలో కోవిడ్-19 నెగిటివ్ సర్టిఫికేట్ ఉన్న వారిని, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే ఆలయ ప్రవేశానికి అనుమతి ఉంటుంది. ఫిబ్రవరి 17 రాత్రి సమయంలో నెలవారీ పూజలు పూర్తయిన తర్వాత ఆలయం మూసివేయబడుతుంది. మార్చి 8న నెలవారీ పూజలు, ఉత్రం పండుగకు సంబంధించి ఆలయం తిరిగి తెరవబడుతుంది. మార్చి 9న ఉత్సవ జెండాను ఎగురవేస్తారు. ఆరాట్ పండుగ తర్వాత మార్చి 19న ఆలయాన్ని మూసివేస్తారు.