More

  ఆ రెండు నాటో దేశాలకు షాక్.. అన్నంతపని చేసిన పుతిన్..!

  రష్యా సరఫరా చేసిన గ్యాస్‌కు సంబంధించి రూబిల్స్‌లో పేమెంట్ చేయడానికి పోలాండ్‌, బల్గేరియా నిరాకరించడంతో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. పోలాండ్, బల్గేరియాకు గ్యాస్ సరఫరా రష్యా నిలిపివేస్తున్నట్లు సమాచారం.

  ప్రస్తుతం పోలాండ్ వార్షిక డిమాండ్ 21bn క్యూబిక్ మీటర్ల గ్యాస్‌లో 55% సరఫరాను రష్యా చేస్తుంది. ఏప్రిల్ 27 నుంచి యమల్ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరాను రష్యా పూర్తిగా నిలిపివేస్తుందని పోలాండ్ ప్రభుత్వ గ్యాస్ సంస్థ PGNiG తెలిపింది. గాజ్‌ప్రోమ్ నుంచి గ్యాస్ డెలివరీలను నిలిపివేస్తామని బెదిరింపులు వచ్చాయని పోలాండ్ ప్రధానమంత్రి మాటెస్జ్ మొరావికీ అన్నారు. పోలాండ్‌కు రష్యన్ గ్యాస్ సరఫరా నిలిపివేసినట్లు రష్యన్ స్టేట్ ఎనర్జీ కంపెనీ గాజ్‌ప్రోమ్ మాత్రం ఇంత వరకు ధ్రువీకరించలేదు. రష్యన్ ప్రభుత్వ వార్తా సంస్థ TASSకి ఒక ప్రకటనలో.. పోలాండ్ తప్పనిసరిగా రూబిల్స్ చెల్లించాలని గాజ్‌ప్రోమ్ చెప్పింది.

  గాజ్‌ప్రోమ్ ప్రకటనను పోలాండ్‌ను రష్యా బెదిరింపుగా మొరావికీ చెప్పారు. ఇలాంటి పరిస్థితికి పోలాండ్ ముందుగానే సిద్ధమైందని, వివిధ రకాల ఇంధన వనరులను అభివృద్ధి చేశామని, పోలిష్ గ్యాస్ నిల్వ సౌకర్యాలు 76 శాతం ఉన్నాయని ఆ దేశ ప్రధాని వెల్లడించారు. పోలాండ్‌ ఇళ్లలో గ్యాస్ కొరత ఉండదని పోలాండ్ వాతావరణ మంత్రి అన్నా మోస్క్వా హామీ ఇచ్చారు. వాయువ్య ప్రాంతంలోని ఓడరేవు నగరం స్వినౌజ్‌స్కై, లిక్విడ్‌ నేచురల్‌ గ్యాస్‌ టెర్మినల్ నుంచి సహా ఇతర వనరుల నుంచి గ్యాస్‌ను పొందేందుకు సిద్ధంగా ఉన్నట్లు PGNiG ప్రకటించింది. ఉక్రెయిన్‌కు బలమైన మద్దతు ఇచ్చిన పోలాండ్‌, అత్యధిక సంఖ్యలో ఉక్రెయిన్‌ శరణార్థులకు అనుమతిని ఇస్తోంది. పాశ్చాత్య దేశాల నుంచి ఉక్రెయిన్‌లోకి ఆయుధాల తరలింపునకు రవాణా కేంద్రంగా పోలాండ్ పనిచేస్తోంది. ఈ ఏడాది చివర్లో 900 కిలోమీటర్ల బాల్టిక్ పైప్‌లైన్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత నార్వే నుంచి గ్యాస్ తీసుకోవాలనే యోచనలో పోలాండ్ ఉంది. ఇప్పుడు నార్వే తమకు అవసరమైన దానిలో దాదాపు సగం గ్యాస్‌ను సరఫరా చేయగలదని వార్సా భావిస్తోంది.

  Gazprom బల్గేరియా ప్రభుత్వ యాజమాన్యం లోని గ్యాస్ కంపెనీ Bulgargazకి గ్యాస్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు చెప్పిందని బల్గేరియా ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తమ బాధ్యతలను పూర్తిగా నెరవేర్చామని, ఒప్పందం ప్రకారం అవసరమైన అన్ని చెల్లింపులు చేశామని బల్గేరియా మంత్రిత్వ శాఖ చెప్పింది. గ్యాస్ కోసం రూబిల్స్‌లో చెల్లించడం ఆమోదయోగ్యం కాదని, బల్గేరియాకు నష్టం కలుగుతుందని వెల్లడించింది. ఇప్పుడు సహజవాయువు సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు బల్గేరియా ప్రభుత్వ సంస్థలు ముందుకొస్తున్నాయని సమాచారం. వార్షిక గ్యాస్ సరఫరా కోసం రష్యాపై పూర్తిగా ఆధారపడిన బల్గేరియా.. మాస్కో గ్యాస్ ముప్పు ఆ దేశానికి కూడా తీవ్రమైన ముప్పుగా ఉండనుంది. ప్రస్తుతానికి గ్యాస్ వినియోగాన్ని పరిమితం చేయాల్సిన అవసరం లేదని బల్గేరియా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ వార్తతో మూడు శాతం యూఎస్‌ సహజ వాయువు ఫ్యూచర్స్ పెరిగాయి.

  గత నెలలో తమ గ్యాస్ చెల్లింపులను రూబిళ్లుగా చెల్లించాలని సన్నిహితంగా లేని దేశాలకు అల్టిమేటం రష్యా అందజేసింది. రూబిల్స్‌లో గ్యాస్ చెల్లింపులు చేయడానికి నిరాకరించే దేశాలకు ఏప్రిల్ నుంచి గ్యాస్ సరఫరాను నిలిపివేసే ప్రమాదం ఉందని చెప్పింది. ముప్పు ఉన్నప్పటికీ.. సరఫరా నిలిపివేస్తామని ప్రకటించే ముందు ఏప్రిల్‌లో చాలా వరకు యూరప్‌కు గ్యాస్ సరఫరాను కొనసాగించింది. పుతిన్ నిర్ణయంతో ఐరోపాలో తీవ్ర ఆందోళనలు ఎదురవుతున్నాయి. రష్యా గ్యాస్ సరఫరా లేకుండా ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచడం కష్టంగా మారే అవకాశం ఉంది. ఎక్కువగా గ్యాస్‌ కోసం ఆధారపడిన పెద్ద దేశాలు జర్మనీ, ఇటలీకి పుతిన్‌ హెచ్చరికగా నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధంతో మాస్కోపై విధిస్తున్న కఠిన ఆంక్షలను నిరోధించే లక్ష్యంతో పుతిన్‌ ఉండవచ్చని విశ్లేషకుల భావన.

  Trending Stories

  Related Stories