More

    తొలిసారి రష్యా సైనికుడికి ఉక్రెయిన్‎లో శిక్ష..!

    నిరాయుధుడైన ఉక్రెయిన్ పౌరుడిని చంపిన రష్యా సైనికుడికి ఉక్రెయిన్‌ కోర్టు జీవిత ఖైదు విధించింది. రష్యా సైనికుడి యుద్ధ నేరంపై విచారణ జరిపిన కోర్టు సోమవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

    రష్యన్‌ ఆర్మీ ట్యాంక్‌ కమాండర్‌, 21 ఏళ్ల సార్జెంట్ వాడిమ్ షిషిమరిన్, ఫిబ్రవరి 28న ఈశాన్య ఉక్రేనియన్ గ్రామమైన చుపాఖివ్కాలో కారులో వెళ్తున్న 62 ఏళ్ల వ్యక్తిని కాల్చి చంపాడు. రష్యా సైనిక అధికారి ఆదేశాల మేరకు నిరాయుధుడైన ఆ వృద్ధుడి తలపై గన్‌తో కాల్పులు జరిపాడు.

    మరోవైపు ఉక్రెయిన్‌ ఆర్మీకి చిక్కిన ఈ రష్యా సైనికుడు సార్జెంట్ వాడిమ్ షిషిమరిన్ యుద్ధ నేరాలపై కీవ్‌లోని ఆ దేశ కోర్టు విచారణ జరిపింది. నిరాయుధుడైన వృద్ధుడ్ని కాల్చి చంపిన నేరాన్ని అతడు ఒప్పుకున్నాడు. దీంతో న్యాయమూర్తి సెర్హి అగాఫోనోవ్ రష్యా సైనికుడికి జీవిత కారాగార శిక్ష విధించారు. ఈ మేరకు సోమవారం తీర్పు వెల్లడించారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై దాడిని రష్యా ప్రారంభించింది. అయితే రష్యా యుద్ధ నేరాలకు సంబంధించి ఉక్రెయిన్‌ కోర్టు ఒక రష్యా సైనికుడికి తొలిసారి ఈ మేరకు శిక్ష విధించింది.

    Trending Stories

    Related Stories