More

  ఆదుకోండి ప్లీజ్..! భారత్‎కు రష్యా విన్నపం..!!

  భారత్ ఇప్పుడు ప్రపంచదేశాలకు ఒక ఆశాకిరణంలా కనిపిస్తోంది. ఆపద సమయంలో భారత్ మాత్రమే ఆదుకోగలదని ఆయా దేశాలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అగ్రదేశాలు సైతం భారత్ ను సహాయం చేయమని అభ్యర్థించే స్థాయికి మన విదేశాంగ విధానం పటిష్టమైంది. రష్యా కూడా యుద్ద సమయంలో భారత్ మాత్రమే తమకు సహాయపడగలదనీ,.. అగ్రదేశాల ఆంక్షల బెదిరింపులను భారత్ మాత్రమే ఎదుర్కోగలదని రష్యా భావిస్తోంది. అందుకే క్రెమ్లిన్ వర్గాలు భారత్ తో వాణిజ్యాన్ని మరింత పెంచడం కోసం దౌత్య అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. రష్యా ఉక్రెయిన్ ల మధ్య యుద్దం జరుగుతున్న నేపథ్యంలో రష్యాపై అమెరికా, యూకేలతోపాటు నాటో కూటమి తీవ్ర ఆంక్షలు విధించాయి. రష్యాతో అప్పటివరకూ జరిపిన లావాదేవీలన్నిటినీ నిలిపివేశాయి. దీంతో రష్యా తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. ఈ ఆంక్షలతో దేశంలో వ్యాపారాలన్నీ తీవ్ర కుదుపులకు లోనవుతున్నాయి. రష్యాలో తయారవుతున్న ఉత్పత్తులకు కావాల్సిన ముడి సరుకు, విడిభాగాల్లో భారీగా కొరత ఏర్పడింది. దీంతో ఏమీ చేయలేక భారత్ ను ఆశ్రయించింది.

  ముఖ్యంగా రష్యాలో కార్లు, రైళ్ళు, ఎయిర్ క్రాఫ్ట్ ల తయారీకి కావాల్సిన ముడి పదార్థాలకు భారీగా కొరత ఎర్పడినట్లు తెలుస్తోంది. యుద్దానికి ముందు ఈ విడిభాగాలను యూరప్ జర్మనీ, అమెరికాల నుంచి దిగుమతి చేసుకునేది. అయితే యద్దం తర్వాత ఆంక్షల నేపథ్యంలో రష్యాకు విడిభాగాల సరఫరా పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో రష్యాలో ఆటోమొబైల్ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడింది. కొత్త ఉత్పత్తుల తయారీ రంగం వృద్ది నెమ్మదిగా పడిపోతూ వచ్చింది. ఈ కొరతను నివారించడానికి వీటి తయారీ కోసం దాదాపు ఐదొందల విడిభాగాల పరికరాలను భారత్ నుంచి పొందాలని క్రెమ్లిన్ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విడిభాగాల జాబితాను భారత అధికారులకు అందజేసినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ మాస్కోలో పర్యటించారు. ఈ పర్యటనకు ముందే రష్యా తన అభ్యర్థనను పంపించినట్లు తెలుస్తోంది. అయితే జైశంకర్ రష్యా పర్యటనలో ఈ విషయం గురించి చర్చించారా లేదా అన్నది స్పష్టం అవలేదు. భారత ప్రభుత్వం కూడా ఈ విషయంపై చర్చించినట్లు ఎక్కడా తెలపలేదు. అయితే భారత్ నుంచి కేవలం ఆటోమోబైల్ ఉత్పత్తులే కాకుండా పేపర్‌ బ్యాగులు, కన్స్యూమర్‌ ప్యాకేజింగ్‌, టెక్స్‌టైల్‌, నికెల్‌ లాంటి లోహ పదార్థాలు కూడా రష్యా దిగుమతి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

  రష్యాకు ఇప్పటికే చైనా సహాయం చేస్తున్నా కూడా భారత్ నుంచి రష్యా మరింత సహాయం ఆశిస్తోంది. ఇప్పటికే అమెరికా ఉక్రెయిన్ లు రష్యాపై ఆంక్షల రూపంలో రష్యా ఎదుగుదలను కట్టడి చేస్తున్నాయి. నాటో దేశాలు కూడా రష్యాతో వాణిజ్యం గనుక జరిపితే ఆయా దేశాలు ఆంక్షలకు బలికావాల్సిందేనని హెచ్చరిస్తున్నాయి. దీంతో ఇతర దేశాలన్నీ రష్యాతో వాణిజ్యం జరపడానికి అంతగా సాహసించలేకపోతున్నాయి. భౌగోళికంగా చిన్నదేశాలు, బలిష్టమైన నాయకత్వ లేని కారణంగా ఆయా దేశాలు అమెరికా, యూకేల ఆధిపత్యాలను ఎదురించలేకపోతున్నాయి. దీంతో కష్టాల్లో ఉన్న రష్యాకు భారత్ మాత్రమే ఒక ఆశాకిరణంగా కనిపిస్తోంది. భారత్ మాత్రమే అమెరికా, యూకేల ఆంక్షలను ఎదిరించగలదని క్రెమ్లిన్ వర్గాలు భావిస్తున్నాయి. భారత్ ను ధిక్కరించి అమెరికా సైతం నిలువలేదనీ, అంతేకాకుండా దేశ నాయకత్వం కూడా బలంగా ఉండటంతో అమెరికా ఆంక్షలు విధించే సాహసం చేయలేదని రష్యా గుర్తించింది. అందుకే యుద్దం మొదలైనప్పటినుంచీ భారత్ తో వాణిజ్యాన్ని మరింత పెంచింది. చమురుపై డిస్కౌంట్లను ప్రకటించి భారత్ కు దగ్గరైంది రష్యా. అయితే ఇటు చైనా కూడా రష్యాకు సహకరిస్తున్నా,.. కొన్ని అనివార్య కారణాల వల్ల, సొంత అవసరాల కోసం.. ఆ దేశాన్ని ఏమీ అనలేకపోతోంది. కానీ, భారత్ స్వతంత్ర్య దేశమైనా బలమైన నాయకత్వం ఉండటం వల్ల అమెరికా భారత్ ను ధిక్కరించలేకపోతోందన్నది ఎవరూ కాదనలేని సత్యం. గతంలో కూడా రష్యా భారత పారిశ్రామికవేత్తలతో పాటు దౌత్యవేత్తలతో కూడా చర్చలు జరిపింది. దీనిపై భారత అధికారులు సముఖత వ్యక్తం చేశారు.

  భారత నాయకత్వం అమెరికా ఆంక్షలకు తలొగ్గే పరిస్థితుల్లో ఇప్పుడు కనిపించడంలేదనే విషయాన్ని రష్యా గుర్తించినట్లు కనిపిస్తోంది. యుద్దం మొదలై నెలలు గడుస్తున్నా భారత్ రష్యాతో పూర్తి స్థాయిలో వాణిజ్యం నడుపుతోంది. యుద్దం ముందుకంటే యుద్దం తర్వాతే భారత్ రష్యా వాణిజ్యం మరింత పెరిగింది. అయినా కూడా అమెరికా, యూకేలు భారత్ ను ధిక్కరించలేకపోతున్నాయి. దీనికి కారణం భారత నాయకత్వమే. ఇప్పటికే జైశంకర్ వీలైనన్ని చోటల్లా భారత్ స్వతంత్ర్య దేశమనీ, ఏ దేశానికీ అనుకూలంగా కానీ, వ్యతిరేకంగా కానీ వ్యవహరించదని విదేశాల్లోనే ఖరాకండిగా చెప్పేశారు. దీనిపై రష్యా పూర్తిగా నమ్మకంతోనే తాజా ప్రతిపాదనలు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, లైక్ చేయండి, షేర్ చేయండి. నేషనలిస్ట్ హబ్ గ్రూపాఫ్ ఛానెల్స్ ను సబ్‎స్క్రయిబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి.

  Trending Stories

  Related Stories