International

ద్రౌపదీ ముర్ముకు రష్యా అధ్యక్షుడు పుతిన్ శుభాకాంక్షలు..!

భారత నూతన రాష్ట్రతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్మకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు.

ఆమె నేతృత్వంలో ఇరు దేశాల మధ్య సహకారం మరింత దృఢమవ్వాలని ఆకాంక్షించారు. ఈ మేరకు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. భారత్ తో విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్య సంబంధాలకు తాము ప్రాధాన్యమిస్తామని ప్రకటనలో తెలిపారు. దేశాధినేతగా ద్రౌపదీ ముర్ము నాయకత్వంలో రెండు దేశాల మధ్య రాజకీయ, ఉత్పాదక సహకారం మరింత వృద్ధి చెందుతుందని తాము విశ్వసిస్తున్నామని వెల్లడించారు. పలు రంగాల్లో మన స్నేహపూర్వక దేశాల పరస్పర ప్రయోజనాలు, అంతర్జాతీయ స్థిరత్వం, భద్రత కోసం మీ ప్రొత్సాహం ఉంటుందని ఆశిస్తున్నామని సందేశం పంపారు.

అయితే ఇటీవలె జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధి ద్రౌపదీ ముర్ము ఘన విజయం సాధించారు. ఈ అత్యున్నత పీఠాన్ని అధిరోహించే తొలి గిరిజన మహిళగా ఆమె సరికొత్త చరిత్ర లిఖించారు. అంతేగాక ఈ పదవిని చేపడుతున్న అత్యంత పిన్న వయస్కురాలు కూడా ఈమే కావడం విశేషం. అగస్టు 25న నూతన రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణం స్వీకారం చేయనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

2 × one =

Back to top button