ఔరంగ జేబు ఎలాంటి వాడు? పరమత సహనం కలిగినవాడా? ఏమిటీ…! యుద్ధ సమయంలో దెబ్బతిన్న హిందూ ఆలయాల మరమ్మతులకు.. నిధులు ఇచ్చాడా? ఏమిటీ ఈ అసత్యాలు…! అది కూడా విద్యార్థులకు బోధించే పాఠ్యపుస్తకాల్లో అబద్దాలను చొప్పిస్తారా? పరమ కిరాతకుడైన పాలకుడిని గొప్పగా పేర్కొంటారా? రాసేవాడి ఇంగీతం ఏంటో ఇట్టే తెలిసిపోతుంది? మరి… ఈ అబద్దాల చరిత్రను మన భావితరాలకు ఇంకా ఎంతకాలం బోధిస్తుంటారు? వారికి నిజాలు చెప్పాల్సిన అవసరం లేదా?
అదేంటో భయ్యా…! ఈ వార్త చూసినప్పటి నుంచి ఎక్కడలేని కోపం వచ్చేస్తోంది.! సోకాల్డ్ లెఫ్ట్ లిబరల్ చరిత్రకారులపై వచ్చేస్తోంది. కమ్యూనిస్టు చరిత్రకారులు… మరిఇంతలా దిగజారుతారా? అసలు చరిత్రను మాయం చేస్తారా? క్రైస్తవం..ఇస్లాం మూలంగా ఎన్నో ప్రాచీన సంస్కృతులు, నాగరికతలు, ఇంకా జాతులు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇక మన దేశంలోని ఈ కమ్యూనిస్టులు, సోకాల్డ్ కుహనా చరిత్రకారులు.., చరిత్రలోని అసలు నిజాలను చెరిపివేసి అబద్దాలను మన పిల్లలకు బోధించడం ఎంత వరకు కరెక్టు భయ్యా?
ఏమిటీ ఇదంతా అనుకుంటున్నారా? నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్..! పొడి అక్షరాల్లో చెప్పాలంటే NCERT..! ఇది ప్రచురించిన 12వ తరగతి చరిత్ర టెక్ట్స్ బుక్ లోని పేజీ నంబర్ 234లో అసత్యాలను ప్రచురించారు. ఆ అసత్యాలు ఏంటో తెలుసా? అయితే వినండి..! హిందూ ఆలయాల పునరుద్ధరణకు మొగల్ పాలకుడైన ఔరంగజేబు నిధులు మంజూర్ చేసినట్లు ఆ హిస్టరీ బుక్ లో పేర్కొన్నారు. అంతేనా…ఆలయాల నిర్మాణం…అలాగే నిర్వహణ కోసం మొగల్ చక్రవర్తులు అంతా కూడా నిధులు ఇచ్చారట. ఇంకా యుద్ధాలు జరిగే సమయంలో ఆలయాలు ధ్వంసమైతే…, ఆ తర్వాత వాటి మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేశారట. షాజహాన్ , ఔరంగజేబు పాలనలో ఇది స్పష్టంగా వెల్లడి అవుతోందట. ఇంకా తప్పని పరిస్థితుల్లో.. జిజియా పన్నును హిందువుల నుంచి వసులు చేయాల్సి వచ్చిందట. ఇవన్నీ కూడా అబద్దాలే.!
అయితే… హిస్టరీ బుక్కుల్లో అక్రమంగా చొప్పించిన ఈ అబద్దాలపై భారత్ పూర్ కు చెందిన దీపేందర్ సింగ్ అనే ఆర్టీఐ కార్యకర్త… NCERTని నిలదీశాడు. మొగల్ పాలకులు హిందూ ఆలయాల కోసం నిధులు వెచ్చించారనే దానికి ఆధారాలేంటో తెలపాలని సమాచార హక్కు చట్టం ద్వారా కోరాడు. అసలు ఏ ఆధారం లేకుండానే… సెక్యులర్ దృక్కోణంలో మొత్తం చరిత్రనే మార్చేశారట. తమ వద్ద అలాంటి ఆధారాలు లేవని .. NCERT తెలిపింది.
దీంతో ఇప్పుడూ…ఔరంగజేబు గురించి వక్రీకరించి రాసిన భాగాలను 12వ తరగతి చరిత్ర పాఠ్యపుస్తకం నుంచి తొలగించాలని దీపేందర్ సింగ్ న్యాయపోరాటానికి దిగాడు. దీనిపై ఆయన NCERTకి లీగల్ నోటీసులు పంపించాడు.
మరోవైపు… NCERT అబద్దాలకు సంబంధించిన పుస్తకంలోని భాగాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో…దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. కరుడుగట్టిన ఇస్లామిక్ మతోన్మాది అయిన ఔరంగజేబును… పరమత సహనం కలిగిన పాలకుడిగా వర్ణిస్తారా అంటూ నెటిజన్లు సైతం మండిపడుతున్నారు.