National

20 ఏళ్ళ క్రితం మూసివేసిన KGF ఆసుపత్రికి…తిరిగి ప్రాణం పోసిన RSS స్వయం సేవకులు

అది 20 ఏళ్ళ క్రితం మూసివేయబడిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఆసుపత్రి. షార్ట్ కట్ లో KGF ఆసుపత్రిగా పిలిచేవారు. 1880లో బ్రిటిష్ వారి పాలన కాలంలో గోల్డ్ మైన్స్ కు యజమానులుగా ఉన్న జాన్ టేలర్ అండ్ సన్స్… డాక్టర్ టిజె ఓ డోన్నెల్ సోదరుల ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రిని నిర్మించడం జరిగింది. ఈ ఆసుపత్రికి డాక్టర్ టిజె ఓ డోన్నెల్ 25 ఏళ్ళపాటు మెడికల్ ఆఫిసర్ గా సేవలు అందించారు.  స్థానిక గని కార్మికుల కుటుంబాలతోపాటు, పొరుగు జిల్లాల ప్రజలు.. మద్రాస్ , చిత్తూరు నుంచి చికిత్స కోసం జనం ఈ ఆసుపత్రికి వచ్చేవారు.

నాలుగు వార్డులున్న ఈ ఆసుపత్రిలో ప్రతి వార్డులో 200 వందల పడకలుండేవి. మొత్తంగా 800 వందల పడకలతో ఆ రోజుల్లో ఆసియాలోనే అతి పెద్ద ఆసుపత్రుల్లో ఒకటిగా నిలిచింది KGF ఆసుపత్రి. 120 ఏళ్ళ క్రితం  కరెంటు తోపాటు ఎక్స్ రే యూనిట్  కలిగిన మొదటి ఆసుపత్రి కూడా ఇదే. తర్వాత కాలంలో ఇక్కడ స్థిరపడిన బ్రిటిష్ కుటుంబాలు పట్టణాలకు వలస వెళ్లిపోవడంతో ఆసుపత్రుల్లో సేవలకు అంతరాయం ఏర్పడింది. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ ఆసుపత్రి గనులశాఖ ఆధ్వర్యంలోకి వెళ్లింది. 1980 వరకు కూడా ఈ ఆసుపత్రి అనేకమందికి సేవలు అందించింది. అయితే తర్వాత కాలంలో కోలార్ గనుల్లో మైనింగ్ కార్యకలాపాలు మందగించడం, వరుస నష్టాలతో 2001లో కేంద్రప్రభుత్వం ఈ మైన్స్ ను పూర్తిగా మూసివేసింది. గనులతోపాటే ఆసుపత్రి కూడా మూతపడింది.

ప్రస్తుతం కొవిడ్ కేసులు పెరిగిపోతుండటంతో కోలార్ లోక్ సభ సభ్యుడు ఎస్.మునిస్వామి ఈ ఆసుపత్రిని తిరిగి తెరిచేందుకు జిల్లా యంత్రాంగానికి లేఖలు రాశారు. అలాగే కేంద్ర గనులశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి దృష్టికి సైతం ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఆసుపత్రిని తిరిగి పునరుద్దరించేందుకు వెంటనే అనుమతులను మంజూరు చేసింది. కర్ణాటకలోని యడియూరప్ప ప్రభుత్వం కూడా ఈ ఆసుపత్రిని పూర్తి స్థాయి కోవిడ్ కేర్ సెంటర్ మార్చేందుకు నిర్ణయం తీసుకుంది.

కర్ణాటక ప్రభుత్వం నిర్ణయమైతే తీసుకుంది కానీ… 20 ఏళ్ళ క్రితం మూసివేయబడిన ఆసుపత్రి కావడంతో పూర్తిగా చెట్లుచేమలతో చెత్తచెదారంతో ఆసుపత్రి ప్రాంగణం అంతా నిండిపోయింది. ఆసుపత్రిలోని వస్తువులు, ఫన్నిచర్ అంతా కూడా టన్నుల కొద్దిగా దుమ్ము పెరుకుని…, గబ్బిలాలు నిలయంగా మారింది. దీనిని శుభపర్చడం కోసం కోలార్ బీజేపీ ఎంపీ మునిస్వామి స్థానిక ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల సాయం కోరారు. దీంతో వెంటనే రంగలోకి దిగిన 200 వందల మంది ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఆసుపత్రిని శుభపర్చే పనిని మొదలు పెట్టారు. వీరికి బీజేపీ కార్యకర్తలు కూడా తోడయ్యారు. అటు ప్రభుత్వ సిబ్బంది.. ఇటు స్వయం సేవకులు అంతా కలిసి రెండువారాల పాటు డే అండ్ నైట్ శ్రమించారు. దాదాపు 400 ట్రక్కుల చెత్తను ఆసుపత్రి నుంచి తొలగించారు. ఆసుపత్రి భవన సముదాయం మంచి కండిషన్ లోనే ఉండటంతో భూజులను తొలగించి శుభ్రం చేశారు. కొత్తగా కలర్స్ కూడా వేయించారు. ప్రభుత్వం కూడా కోవిడ్ కేర్ సెంటర్ కు అవసరమైనా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను సైతం యుద్ధప్రతికన ఆసుపత్రిలో ఏర్పాటు చేసింది. ఎలక్ట్రిఫికేషన్ తోపాటు ప్లంబర్ వర్క్స్ సైతం పూర్తయ్యాయి. అన్ని రకాల సౌకర్యాలతో కూడిన ఐసీయూలుగా నాలుగు రూములను కన్వర్ట్ చేశారు. ఆసుపత్రిని తిరిగి పునరుద్ధించాలనే ప్రభుత్వ సంకల్పానికి తమ శ్రమదానం తోడైనందుకు సంతోషంగా ఉందని ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు తెలిపారు. ఈ వారంలోనే ఈ ఆసుపత్రి అందుబాటులోకి రానుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

17 − twelve =

Back to top button