6 ఆర్ఎస్ఎస్ ఆఫీసులకు బాంబు బెదిరింపు..!

0
773

ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని 6 ఆర్ఎస్ఎస్ కార్యాలయాలను బాంబులతో పేల్చివేస్తామని వాట్సాప్‌లో బెదిరింపు సందేశం వచ్చింది. లక్నో, ఉన్నవ్ నగరాల్లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయాలను బాంబులతో పేల్చివేస్తామని సోమవారం రాత్రి వాట్సాప్ లో ఓ వ్యక్తి బెదిరింపు మెసేజ్ పంపించారు.

ఈ బెదిరింపు మెసేజ్ ఆర్ఎస్ఎస్ సభ్యుడు నీలకాంత్ తివారికి సోమవారం రాత్రి వచ్చింది. అంతర్జాతీయ ఫోన్ కాల్ నుంచి ఈ బెదిరింపు మెసేజ్ హిందీ, ఇంగ్లీషు, కన్నడ భాషల్లో వచ్చింది. ఈ బెదిరింపు కాల్ కు సంబంధించి మడియాన్ పోలీసులు కేసు నమోదు చేశారు. యూపీలో 2, కర్ణాటకలో 4 ఆర్ఎస్ఎస్ కార్యాలయాలను పేల్చివేస్తామని ఆగంతకుడు బెదిరించారు. సైబర్ సెల్ సహాయంతో వాట్సాప్ సందేశం పంపిన ఫోన్ నంబరును గుర్తిస్తామని లక్నో పోలీసులు చెప్పారు. బెదిరింపు నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ కార్యాలయాలకు పోలీసు బందోబస్తు పెంచారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నాగ్‌పూర్‌లో సంఘ్ శిక్షా వర్గ్ ముగింపు కార్యక్రమంలో మత సామరస్యానికి పిలుపునిచ్చిన కొన్ని రోజుల తర్వాత ఈ బెదిరింపు ఘటన జరిగింది. ముస్లింలు తమ పూర్వీకుల వారసులని, రక్తసంబంధం ద్వారా తమ సోదరులని హిందువులు గుర్తించాలని భగవత్ అన్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here