More

    గోవాలో ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో ఆర్ఆర్ఆర్ భేటీ

    ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముతో బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్‌, ర‌ఘునంద‌న్ రావు, ఈట‌ల రాజేంద‌ర్‌లు గురువారం భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ త‌ర‌ఫున ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్ర‌మే ఉన్న సంగతి తెలిసిందే..!

    హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావు.. గోవా‌కు వెళ్లారు. అక్కడ వారు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ద్రౌపది ముర్ము పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె గురువారం గోవాకు చేరుకున్నారు. అక్కడ బీజేపీతో పాటు తనకు మద్దతు తెలపుతున్న పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలతో ద్రౌపది ముర్ము సమావేశం అయ్యారు. ద్రౌపది ముర్ము తన ఎన్నికల ప్రచారంలో భాగంగా జూలై 12 తెలంగాణకు రావాల్సి ఉంది. ఇందుకోసం తెలంగాణ బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. హైదరాబాద్‌‌కు చేరుకున్న ద్రౌపది ముర్ము‌కు ఘన స్వాగతం పలికేందుకు సిద్దమవ్వగా.. భారీ వర్షాల కారణంగా ఈ పర్యటన రద్దైనట్టుగా బీజేపీ వర్గాలు తెలిపాయి. అందుకే గోవాకు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్లారు.

    Trending Stories

    Related Stories