ఆస్కార్ దిశగా RRR..?! రేసులో ‘నాటు నాటు’..?!

0
810

ట్రిపులార్ సినిమా ఆస్కార్ అవార్డుకు గట్టిగానే పోటీపడుతోంది. జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ హీరోలుగా జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా.. భారీ కలెక్షన్లు రాబట్టింది. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‎లను ప్రతిబింబించే ఈ ఊహాత్మక కథకు.. భారీ ప్రేక్షకాదరణ లభించింది. గ్రాఫిక్స్, విజువల్స్, యాక్టింగ్, సాంగ్స్‎లలో హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా నిర్మించారు డైరెక్టర్ రాజమౌళి. అయితే ఇటీవల ఆస్కార్‎కు నామినేషన్లు స్వీకరించే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రపంచ దేశాల నుండి సినిమాల నామినేషన్ కోసం.. ఆ సంవత్సరంలో వచ్చిన ఉత్తమ చిత్రాలను ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో భారత్ నుండి గుజరాతీ మూవీ ‘ఛెల్లో షో’ ఆస్కార్‎కు నామినేట్ అయింది. కానీ. సినీ ప్రేక్షకులందరూ ఈసారి ట్రిపులార్‎ను నామినేట్ చేస్తారని ఆశలు పెట్టుకున్నారు. భారత్‎లో వచ్చిన సినిమాల్లో ది బెస్ట్ మూవీ ట్రిపులార్ అనీ.. అయితే దాన్ని కాదని ఛెల్లో షో ను నామినేట్ చేయడమేంటని జ్యూరీపై సినీ అభిమానులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. అయితే జ్యూరీ ట్రిపులార్‎ను సెలెక్ట్ చేయకపోవడానికి కూడా చాలా కారణాలున్నాయి.

ఇక అభిమానులు తీవ్ర నిరాశకు గురవడంతో సినీ యూనిట్ స్వతంత్రంగానే దీనిని నామినేట్ చేయాలని నిర్ణయించుకుంది. ఆస్కార్ జనరల్ కేటగిరీలో ట్రిపులార్‎ను ప్రమోట్ చేస్తున్నట్లు సినీ యూనిట్ ట్విట్టర్‎లో ప్రకటించింది. ఈ సినిమా ఆస్కార్‎లోని మొత్తం 14 కేటగిరీల్లోనూ పోటీ పడుతోంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, స్క్రీన్ ప్లే, ఒరిజినల్ సాంగ్, స్కోర్ విభాగాల్లో పోటీ పడుతోంది. ఇవేకాకుండా, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, సౌండ్, ప్రొడక్షన్ డిజైన్‎తో విభాగాల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటోంది. వీటితోపాటు.. వీఎఫ్ఎక్స్, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ సహాయ నటుడు విభాగాల్లోనూ పరీక్షకు సిద్ధమైంది. ముఖ్యంగా ఉత్తమ ఒరిజినల్ సాంగ్‎గా ‘నాటు నాటు’ పాట కూడా పోటీ పడుతోంది.

అయితే ఆస్కార్‎కు ఏదైనా సినిమా పోటీ పడాలంటే ముందుగా వీటిని వాషింగ్టన్ థియేటర్లలో ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇప్పుడు ట్రిపులార్ టీం కూడా అదే పనిలో ఉంది. వాషింగ్టన్ వీధుల్లో ఆస్కార్‎ను ప్రమోట్ చేస్తున్నారు. ఎక్కువగా నాటునాటు సాంగ్‎ను ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అటు, ఈ సినిమా ఆస్కార్ సాధిస్తుందని సినీ ప్రేక్షకులు భారీ ఆశలను పెట్టుకున్నారు. ఇప్పటివరకు హాలీవుడ్ సినిమాలకే పరిమితమైన.. ఆస్కార్ భారతీయ సినిమాలను కూడా గుర్తించే రేంజిలో ట్రిపుల్ ఆర్ సినిమా నిర్మితమైంది. ఇన్నాళ్ళూ బాలీవుడ్ సినిమాలను ఎంతో ఖర్చు పెట్టి తీసినా కూడా ట్రిపులార్ స్థాయికి ఎదగలేకపోయాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల వసూళ్ళను రాబట్టింది. దాదాపు అన్ని కేటగిరీల్లో కూడా ట్రిపులార్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. అందుకోసమే ఈ సినిమా ఆస్కార్ కోసం 14 కేటగిరీల్లో పోటీ పడుతోంది.

ఇక ట్రిపులార్ సినిమాకు ఆస్కార్ లభిస్తే.. అది భారతీయ సినిమాకు మరింత బూస్టింగ్ ఇచ్చినట్లవుతుంది. ఇన్నాళ్లూ హాలీవుడ్ తీసిన సినిమాలు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా రిలీజయ్యేవి. వాటికి ఉన్న ఆదరణతో బడ్జెట్ కూడా అదేస్థాయిలో ఉండేది. వేల కోట్లు పెట్టి అధునాతన గ్రాఫిక్స్ తో సినిమాలు నిర్మించేవారు. అయితే భారత సినిమాల దగ్గర తక్కువ ఖర్చుతో నిర్మించినా వాటిని హాలీవుడ్ రేంజిలో నిర్మించే నైపుణ్యం భారతీయుల సొంతం. నటన నుండి గ్రాఫిక్స్ దాకా అన్నిటిలోనూ హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోనిదిగా నిర్మించగలరు. అయితే వీటికి ప్రపంచవ్యాప్త గుర్తింపు కూడా తోడైతే భారత చలన చిత్రం మరో మైలురాయిని దాటినట్లవుతుంది. భారత సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే కేవలం హాలీవుడ్ చిత్రాలకోసమే ఏర్పాటు చేసిన ఆస్కార్ అవార్డు ఇప్పుడు భారతీయ సినిమాను వరిస్తుందా..? లేక ఎప్పటిలాగానే తెల్లతోలు దురహంకారం భారతీయ సినిమాను తొక్కేస్తుందా..? అనేది వేచి చూడాల్సిందే..!

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

one × 2 =