ఆర్ఆర్ఆర్ మూవీ విలన్ కన్నుమూత..!

0
385

“RRR”లో విలన్ గా నటించిన రే స్టీవెన్సన్ కన్నుమూశారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో బ్రిటిష్ గవర్నర్‌గా అసలైన విలనిజాన్ని చూపించారు రే స్టీవెన్సన్. మార్వెల్ చిత్రాలలోని “థోర్” సిరీస్ లో కీలక పాత్రల్లో కనిపించి ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని సంపాదించారు రే స్టీవెన్సన్. HBO సిరీస్ “రోమ్”లో కూడా కనిపించి అలరించారు. రే స్టీవెన్సన్ వయసు 58 సంవత్సరాలే. స్టీవెన్సన్ ప్రతినిధులు అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడుతూ.. రే స్టీవెన్సన్ మరణించాడని తెలిపారు.

స్టీవెన్సన్ ఉత్తర ఐర్లాండ్‌లోని లిస్బర్న్‌లో 1964లో జన్మించారు. బ్రిస్టల్ ఓల్డ్ విక్ థియేటర్ స్కూల్‌లో చదివిన తర్వాత బ్రిటీష్ టెలివిజన్‌లో కొన్ని సంవత్సరాలపాటు పనిచేశారు. పాల్ గ్రీన్‌గ్రాస్ 1998 లో తెరకెక్కించిన చిత్రం “ది థియరీ ఆఫ్ ఫ్లైట్”లో తన చలనచిత్ర రంగ ప్రవేశం చేసారు. 2004లో, “కింగ్ ఆర్థర్”లో కనిపించారు. “పనిషర్: వార్ జోన్”లో ప్రధాన పాత్ర పోషించారు. రే స్టీవెన్సన్ చనిపోడానికి కారణాన్ని ఇంకా వెల్లడించలేదు.