More

    అక్కడి రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

    కోనసీమలో మరోసారి దాడులు జరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తుండడంతో భారీగా పోలీసులను మోహరించారు. 15 వందల మంది అదనపు బలగాలతో అమలాపురాన్ని అష్టదిగ్బంధనం చేశారు పోలీసులు. కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ కూడా శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ఇతర ప్రాంతాల వ్యక్తులు అమలాపురం రాకుండా పోలీసులకు పహారా కాస్తున్నారు. అమలాపురానికి వెళ్లే బస్సులను నిలిపివేసింది ఆర్టీసీ. కొన్ని టెలికాం ఆపరేటర్లు ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేశారు.

    ఏలూరు డీఐజీ, ఎస్పీలతో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అమలాపురంలో పరిస్థితులపై సమీక్షించారు. అమలాపురం అల్లర్ల ఘటనలో ఏడు కేసులు నమోదు చేశామని డీజీపీ తెలిపారు. కలెక్టరేట్‌, మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యే సతీష్‌ ఇళ్లకు నిప్పు, 3 బస్సుల దహనంపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేశామన్నారు. ఇప్పటికే 46 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేసినట్టు డీజీపీ తెలిపారు. మరో 72 మంది అరెస్ట్‌కు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో రౌడీషీటర్లందరినీ అదుపులోకి తీసుకున్నామని డీజీపీ వెల్లడించారు. అమలాపురంలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందన్నారు. అల్లర్లను అనుకోకుండా జరిగిన పరిణామంగానే భావిస్తున్నామన్నారు. వాట్సాప్‌ గ్రూప్‌లలో తప్పుడు ప్రచారంతోనే అల్లర్లు జరిగాయని.. అమలాపురంలో 144 సెక్షన్ అమలులో ఉందని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

    అమలాపురంలో ప్రస్తుతం 144, 30 సెక్షన్‌ కొనసాగుతున్నాయి. ఆందోళనలో పాల్గొన్న వారిపై వీడియో ఫుటేజీ ఆధారంగా కేసులు పెడుతున్నారు. వివాదానికి కారణమైన జిల్లా పేరు మార్పుపై ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని ప్రకటించింది.

    Trending Stories

    Related Stories