ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌కు సిద్ధమవుతున్న భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారినపడ్డాడు. యాంటిజెన్ పరీక్షల్లో రోహిత్‌కు కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని బీసీసీఐ పేర్కొంది. ఈ మేరకు ఈ తెల్లవారుజామున ట్వీట్ చేసింది. కరోనా నిర్ధారణ కాగానే జట్టు బస చేసిన హోటల్‌లోనే అతడు క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు తెలిపింది. ప్రస్తుతం లీసెస్టర్‌షైర్‌తో జరుగుతున్న నాలుగు రోజుల వామప్ మ్యాచ్‌లో రోహిత్ ఆడుతుండడంతో ఇరు జట్లలోనూ ఆందోళన మొదలైంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ 25 పరుగులు చేశాడు. ఐదు టెస్టుల సిరీస్ కోసం గతేడాది భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించింది. నాలుగు టెస్టులు పూర్తికాగా, భారత్ రెండు టెస్టుల్లో విజయం సాధించగా, ఇంగ్లండ్ ఒక మ్యాచ్‌లో గెలుపొందింది. తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. మాంచెస్టర్‌లో జరగాల్సిన ఐదో టెస్టుకు ముందు భారత ఆటగాళ్లు కరోనా బారినపడడంతో ఆ మ్యాచ్ వాయిదా పడింది. ఆ మ్యాచ్ ను ఈ ఏడాది జులై 1కి రీషెడ్యూల్ చేశారు. ఈ టెస్టు తర్వాత టీ20, వన్డే సిరీస్‌లోనూ ఇంగ్లండ్‌తో తలపడుతుంది.