అచ్చం సినిమా సీన్ లా.. ఢిల్లీ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ ను కోర్టులోనే కాల్చి చంపారు

0
1192

క్లైమాక్స్ లో వచ్చే కోర్టు సీన్ లో లాయర్ల వేషంలో వచ్చే గూండాల తరహాలో కొందరు వచ్చి ఢిల్లీ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ ను కాల్చి చంపారు. ఢిల్లీలోనే టాప్ గ్యాంగ్ స్టర్ జితేందర్ గోగి శుక్రవారం రోహిణి కోర్టులో జరిగిన కాల్పుల్లో చనిపోయాడు. అతడిని ఢిల్లీ పోలీసు ప్రత్యేక సెల్ అరెస్టు చేసింది. రోహిణీ కోర్టులో ఓ కేసులో అరెస్టయిన గ్యాంగ్ స్టర్ జితేంద్ర అలియాస్ గోగిని జడ్జి ముందు ప్రవేశపెట్టేందుకు తీసుకురాగా.. ప్రత్యర్థి ముఠా సభ్యులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. దుండుగులు ఓ మహిళా లాయర్ సహా జితేంద్రపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జితేంద్ర స్పాట్ లోనే చనిపోయాడు. ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో లాయర్ల వేషంలో వచ్చిన ఇద్దరు దుండగులు చనిపోయారు. మరణించిన మరో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రాథమిక నివేదికల ప్రకారం, క్రిమినల్స్ మరియు పోలీసుల మధ్య ఎదురుకాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపబడ్డారు. ఈ సంఘటన వెనుక టిల్లు గ్యాంగ్ ఉండవచ్చని, జితేందర్ గోగిని చంపడమే ప్రధాన లక్ష్యంగా ప్లాన్ చేశారు. ఈ దాడిలో ఒక మహిళా న్యాయవాది కూడా గాయపడినట్లు సమాచారం. కోర్టు ఆవరణలో దాదాపు 35-40 రౌండ్లు కాల్పులు జరిపినట్లు అంచనా వేస్తున్నారు. సాక్షుల ప్రకారం న్యాయవాది యూనిఫాంలో ఉన్న ఇద్దరు దుండగులు కోర్టులో గోగిపై కాల్పులు జరిపారు. పోలీసు బృందం దుండగులపై తిరిగి కాల్పులు జరిపింది. రోహిణి కోర్టు వైస్ ప్రెసిడెంట్ శిల్పేష్ చౌదరి మాట్లాడుతూ, “ఇది భారీ భద్రతా లోపం. నేను బార్ ఆఫీసులో ఉన్నాను. కాల్పుల శబ్దం విని మేము అక్కడికి వెళ్లాము. ఇద్దరు నిందితులు యూనిఫాంలో వచ్చారు. పోలీసులు వారిని చంపారు ” అని తెలిపారు. ఢిల్లీ పోలీసు కమిషనర్ రాకేశ్ ఆస్థానా మాట్లాడుతూ దాడి చేసిన వారిని చంపేశామని, దర్యాప్తు వేగవంతం చేశామని చెప్పారు.

రెండేళ్ల క్రితం ఓ ఘటనకు సంబంధించి జితేంద్రతో పాటు ఢిల్లీ యూనివర్సిటీ టాపర్ అయిన కుల్దీప్ ఫజ్జాను స్పెషల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, కుల్దీప్ ఫజ్జా పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. మొత్తంగా జితేంద్ర గ్యాంగ్ లో 50 మందికి పైగా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. అనేక క్రిమినల్ కేసుల్లో చిక్కుకుని, తీహార్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న జితేందర్ గోగిని కోర్టులో హాజరుపరచబడుతున్నప్పుడు ప్రత్యర్థి టిల్లు గ్యాంగ్ సభ్యులు న్యాయవాదుల వేషం ధరించి కోర్టులోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. గోగి అక్కడికక్కడే మరణించాడు.

पेशी के पर आए बदमाश की गोली मारकर हत्या, वकीलों के भेष में आए हत्यारे, पुलिस मुठभेड़ में हुए ढेर