National

రోహింగ్యాల ఏరివేత మొదలైంది

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రోహింగ్యాల ఏరివేత మొదలైంది. ఇటీవల చోటు చేసుకున్న కొన్ని అరెస్టుల కారణంగా రోహింగ్యాల నకిలీ పత్రాల మోసాలు బయటకు వస్తూ ఉన్నాయి. గజియాబాద్‌లో ఉంటున్న నూర్ ఆలం, అమీర్ హుస్సేన్ అనే ఇద్దరు రోహింగ్యాలను ఉత్తర ప్రదేశ్ ఎటిఎస్ విభాగం అరెస్టు చేసింది. వీరి దగ్గర నకిలీ పత్రాలు లభించడం కలకలం రేపుతోంది. వీరిద్దరిని లక్నోకు ఐదు రోజుల రిమాండ్‌కు పంపారు, అక్కడ వారు విచారణ సమయంలో ఎన్నో విషయాలను బయటపెట్టారు. ఢిల్లీ లోని ఖాజురి ఖాస్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి రోహింగ్యాల అక్రమ వలసలకు సదుపాయం కల్పిస్తున్నాడని.. అతడు ఉత్తరప్రదేశ్‌లో స్థిరపడినట్లు బయటకు వచ్చింది.

నకిలీ రేషన్ కార్డులు, పాన్ కార్డులు, ఓటరు ఐడి కార్డులతో రోహింగ్యాలు ఉత్తర ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారని లా అండ్ ఆర్డర్ ఎడిజి ప్రశాంత్ కుమార్ తెలిపారు. కొందరు అక్రమ వలసదారులను ఓటు బ్యాంకులుగా ఉపయోగిస్తున్నారని.. కొందరు వీరికి ఆర్థిక సహాయం చేస్తున్నారని కూడా తెలిపారు. రోహింగ్యాలు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ స్థిరపడ్డారని.. వారి వద్ద ఆధార్ కార్డులు, ఓటరు ఐడి మరియు ఇతర గుర్తింపు కార్డులు ఉన్నందున వాటిని స్థానిక జనాభా నుండి వేరు చేయడం కష్టమని కుమార్ తెలిపారు. అయినప్పటికీ వారిని గుర్తించే ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.

నూర్ ఆలం, అమీర్ హుస్సేన్ ల విచారణలో కీలక సమాచారం:

నూర్ ఆలం, అమీర్ హుస్సేన్ అరెస్టుకు ఉత్తర ప్రదేశ్ ఎటిఎస్ ఐజి జికె గోస్వామి నాయకత్వం వహించారు. ఎటిఎస్ బృందం నిందితుల నుంచి 70 వేల రూపాయలు, పాన్, ఆధార్, యుఎన్‌హెచ్‌సిఆర్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. భారతదేశంలోకి చొరబడటానికి ఇతర రోహింగ్యాలకు కూడా వీరు సహాయం చేస్తున్నట్లు గుర్తించారు. వీరి దగ్గర నుండి సమాచారం సేకరించిన తరువాత ఆపరేషన్ ను మొదలుపెట్టారు. గోస్వామి మీడియాతో మాట్లాడుతూ “నూర్ ఆలం, అమీర్ హుస్సేన్ తమ సహచరులను కూడా భారతదేశానికి తీసుకొని వస్తున్నారని ప్రాథమిక విచారణలో తేలింది. వారికి ఉద్యోగాలు ఇప్పించడంలోనూ, భారత్ కు చెందిన పత్రాలను ఇప్పించడానికి సహాయం చేస్తామని చెబుతూ రోహింగ్యాల నుండి డబ్బును తీసుకుంటూ ఉన్నారు. వీరిద్దరూ బంగ్లాదేశ్ మీదుగా రోహింగ్యాలను భారత్‌కు తీసుకువచ్చారు ” అని తెలిపారు.

2021లో పట్టుకోబడ్డ రోహింగ్యాలు:

నూర్ ఆలం.. అజీజుల్ హక్ అనే రోహింగ్యా బావమరిది. ఈ ఏడాది జనవరిలో సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఎటిఎస్ అతన్ని అరెస్టు చేసింది. నకిలీ పత్రాలపై హక్ 20 సంవత్సరాలుగా భారతదేశంలో నివసిస్తున్నాడు. ఫిబ్రవరి 28న, మొహమ్మద్ ఫారూక్ మరియు హసన్లను అలీఘర్ లో అరెస్టు చేశారు. దీని తరువాత ఫరూక్ సోదరుడు మార్చి 01 న ఉన్నావోలో పట్టుబడ్డాడు. షాహిద్ దగ్గర నకిలీ భారతీయ గుర్తింపు పత్రాలు, 5 లక్షల రూపాయలు కూడా ఉన్నాయి. ఈ విచారణ సమయంలో రోహింగ్యాలు తమ బంధువుల సహాయంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది స్థిరపడినట్లు తెలిసింది. చాలా మంది రోహింగ్యాలు అలీఘర్, ఆగ్రా, ఉన్నావోలలోని కబేళాలలో పనిచేస్తున్నారు. వీరికి కొందరు ఆర్ధిక సహాయం చేస్తున్నారని.. వారిని కూడా పట్టుకోడానికి ఉత్తరప్రదేశ్ పోలీసులు వేట మొదలు పెట్టారు. అందుకు సంబంధించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

Related Articles

One Comment

  1. There are many Rohingyas in Hyderabad. On road sides of many areas like Tolichowki etc. many Rohingyas are holding placards for help. How these people are able to enter such deep and roam freely in the country without any scrutiny? Why local govt.s and, police in various states are not taking it up seriously?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7 − 7 =

Back to top button