బంగ్లాదేశ్ లోని రోహింగ్యా ముస్లింలకు అక్కడి ప్రభుత్వం కావాల్సినవన్నీ ఓ వైపు అందిస్తూ ఉండగా.. మరో వైపు బక్రీద్ పండుగ కోసం పెద్ద ఎత్తున రోహింగ్యా ముస్లింలు జంతువధ చేసుకోడానికి ప్రభుత్వమే తోడ్పాటు అందించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. రోహింగ్యా ముస్లింలకు ఈద్ కోసం 200కు పైగా గోవులను అందించింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. ఏడు నెలల క్రితమే బంగ్లాదేశ్ లోని కాక్స్ బజార్‌లోని బలూఖాలి రోహింగ్యా శిబిరం నుండి రోహింగ్యాలను భాసన్ చార్‌కు తరలించారు. బక్రీద్ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం శరణార్థులకు 200 ఆవులను బలి ఇవ్వడానికి ఇచ్చింది. ఆ కుటుంబాలు ప్రభుత్వ నిర్ణయానికి ఎంతో సంతోషించాయని అధికారులు తెలిపారు. బోగురా, హతియా నుండి ఆవులను భాసన్ చార్ వద్దకు తీసుకువచ్చారు. రోహింగ్యాలు బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె ఫోటోలను తీసుకుని వచ్చి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.
భాసన్ చార్ లోని ఆశ్రయన్ -3 ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.రషద్ సత్తార్ మాట్లాడుతూ మినిస్ట్రీ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ రిలీఫ్, ఎన్.జి.ఓ. అఫైర్స్ బ్యూరో కలిసి 200కు పైగా గోవులను తీసుకుని వచ్చాయట..! శిబిరంలో నివసిస్తున్న రోహింగ్యాలకు ఆవు మాంసం పంపిణీ చేయబడుతుందని వారు తెలిపారు.
ఇస్లామిక్ రిలీఫ్ బంగ్లాదేశ్ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ జాఫర్ ఆలం ఆవులను తీసుకుని వచ్చి శిబిరంలోని వారికి పంచారు. “ఇస్లామిక్ రిలీఫ్ సంస్థ బోసన్ నుండి 135 ఆవులను రోహింగ్యాల కోసం తీసుకువచ్చింది. ప్రతి ఆవు నుండి మాంసం 35 కుటుంబాలకు పంపిణీ చేయబడుతుంది, ఒక్కో కుటుంబానికి 2 కిలోల మాంసం అందుతుందని” జాఫర్ ఆలం వెల్లడించారు.

కాక్స్ బజార్‌లోని రోహింగ్యా శిబిరాలకు ఈద్ కోసం 375 ఆవులను ఈ సంస్థ అందించింది. శిబిరాల సమీపంలో, చుట్టుపక్కల నివసించే స్థానికులకు మరో 150 ఆవుల మాంసం పంపిణీ చేయబడుతుంది. ఆవులను ప్రభుత్వం ఇవ్వడంతో రోహింగ్యాలు ర్యాలీని చేపట్టారు. జంతువులను దండలు, బెలూన్లతో అలంకరించారు. కాక్స్ బజార్ నుండి సుమారు 100,000 మంది రోహింగ్యాలను భాసన్ చార్‌కు మార్చారు. ఇప్పటివరకు ఎనిమిది దశల్లో 18,521 రోహింగ్యాలను తీసుకువచ్చారు. మిగిలిన వారిని సెప్టెంబర్ నుండి తరలిస్తారు.