త్రిపురలో ఏడుగురు రొహింగ్యాల అరెస్టు..! అక్రమ వలసలు ఆగేదెన్నడో..?

0
700

సరిహద్దు భద్రత విషయంలో ఎన్ని చర్యలు తీసుకున్నా.. దేశంలో మతోన్మాద పిండారీలు అక్రమ వలసలు ఆగడం లేదు. బంగ్లా బోర్డర్ ను శత్రుదుర్బేధ్యంగా మార్చినా.. రోహింగ్యా రాకాసి మిడతల దండు.. చొరబడుతూనేవుంది. తాజాగా త్రిపుర పోలీసులు ఏడుగురు రొహింగ్యాలను అరెస్టు చేశారు. వీరు బంగ్లాదేశ్‎లోని క్యాంపుల్లో నుంచి భారత్‎లోకి అక్రమంగా చొరబడినట్లు పోలీసులు గుర్తించారు. వీరందరూ ఓ కారులో త్రిపుర రాజధానికి ప్రయాణిస్తుండగా పోలీసులకు అనుమానం వచ్చి అంబస్సా పోలీస్ స్టేషన్ దగ్గర అడ్డుకున్నారు. వీరిని విచారించగా వీరందరూ బంగ్లాదేశ్ క్యాంపుల్లో నుంచి భారత్‎లోకి ప్రవేశించినట్లు తెలిపారు. దీంతో పాటు వీరికి సహాయం చేయడానికి భారత్‎లో ఒక ఏజెంట్ కూడా ఉన్నట్లు వెల్లడించారు.

అయితే భారత్‎లో రొహింగ్యాలు అక్రమంగా చొరబడటానికి ఎన్నో అక్రమ రవాణా ముఠాలు సహాయం చేస్తున్నాయి. ఇదే సంవత్సరం మార్చి నెలలో ఎన్ఐఏ ఆరుగురిని అరెస్టు చేసింది. వారనిి అధికారులు తమదైన శైలిలో విచారించే సరికి.. భారత్‎లోని వివిధ పట్టణాల్లో స్థిరపడటానికి రోహింగ్యాలకు సహాయపడుతున్నట్లు తెలిసింది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఓటర్, ఆధార్ కార్డులను సృష్టించి రొహింగ్యాలను సహాయం చేస్తున్నారు. ఈ ఆరుగురిని అస్సాంకు చెందినవారిగా ఎన్ఐఏ గుర్తించింది. వీరు ఎక్కువగా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చే రొహింగ్యాలకు సహాయపడుతున్నట్లు తేలింది.

అయితే ఈ రొహింగ్యాల అక్రమ వలసలకు భారత్‎లోని రాజకీయ నాయకులు కూడా సహాయపడుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఇది ఎక్కువగా పశ్చిమ బెంగాల్‎లో జరుగుతోంది. మమతా బెనర్జీ పాలనలో రొహింగ్యాలను తన ఓటుబ్యాంకుగా మార్చుకోవడం లాంటి దారుణ చర్యలకు పాల్పడింది. ప్రభుత్వ సహకారంతో నకిలీ ధృవ పత్రాలతో ఓటర్, ఆధార్ కార్డులను జారీ చేయడం లాంటి చర్యలకు పాల్పడటంతో రొహింగ్యాల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఈ విధమైన రాజకీయ అండతో బెంగాల్‎లో ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నారు. లూటీలు, దోపిడీల నుంచి సుపారీ హత్యల వరకు వీరు చేయని దారుణాలు లేవు. వీరి వల్ల స్థానిక భారతీయులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల తర్వాత మమతా బెనర్జీ ఎన్నికల్లో గెలవడంతో ఒక్కసారిగా బెంగాల్‎లో భారీ హింసకు పాల్పడ్డారు. పెద్దయెత్తున హిందువులపై దాడులకు పాల్పడుతూ దారుణాలు చేశారు. దీంతో ఈ రొహింగ్యాల ఆగడాలను తట్టుకోలేక చాలామంది బెంగాల్ హిందువులు అస్సాంకు వలస వెళ్ళారు.

ఇక ఈ సమస్య కేవలం బంగ్లాదేశ్ సరిహద్దు రాష్ట్రాల్లోనే కాకుండా భారత్ అంతటా వ్యాపించి ఉంది. తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లో కూడా భారీ సంఖ్యలో రొహింగ్యాలు స్థిరపడ్డారు. గతంలో వీరికి ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉండేది. అయితే ఆ తర్వాత దీనిపై వ్యతిరేకత రావడంతో దీన్ని యూట్యూబ్ నుంచి తొలగించారు. దీంతో పాటు వీరు రొహింగ్యా ఫుట్ బాల్ టీమ్ లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీనిపై బీజేపీ ఎన్నోసార్లు ప్రశ్నించినా కూడా కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయింది.

ఇక రొహింగ్యాలు కేవలం ఒక రాష్ట్రానికి చెందిన సమస్య మాత్రమే కాదు. భారత్‎లోని దాదాపు అన్ని రాష్ట్రాలూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. వీరిని దేశం నుంచి తొలగించడానికి అన్ని రాష్ట్రాలూ కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం దీనిపై గతంలోనే చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నా కూడా ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ముఖ్యంగా పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ఓటుబ్యాంకును కాపాడుకోవడం కోసం అడ్డుపడుతూ వచ్చింది. దీంతో రొహింగ్యాల సమస్య ఇంకా ముగిసిపోలేదు. అయితే ఈ సమస్యపై ఇప్పటికైనా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

seven − 7 =