More

    ఐసీసీ బీసీసీఐ కు సపోర్ట్ అంటూ జరుగుతున్న వార్తలపై స్పందించిన రోజర్ బిన్నీ

    టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫేక్ ఫీల్డింగ్ వివాదంపై చర్చ జరుగుతోంది. కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ వల్ల తమకు అదనంగా రావాల్సిన ఐదు పరుగులు కోల్పోయామని బంగ్లాదేశ్ క్రికెటర్ నూరుల్ అహ్మద్ చెప్పాడు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలివేయబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆపరేషన్ చైర్మన్ జలాల్ యూనస్ తెలిపారు. ఫేక్ ఫీల్డింగ్ విషయాన్ని కెప్టెన్ షకీబల్ హసన్ అంపైర్ల దృష్టికి తీసుకెళ్లాడని, అయినా వారు పట్టించుకోలేదని.. ఈ అంశంపై తప్పకుండా మాట్లాడతామని అన్నారు.

    బీసీసీఐ చేతుల్లో ఐసీసీ ఉందని బంగ్లాదేశ్, పాకిస్థాన్ క్రికెటర్లు, అభిమానులూ వాపోతున్నారు. ఈ సమయంలో బీసీసీఐ నూతన అధ్యక్షుడు రోజర్ బిన్నీ స్పందించారు. ఐసీసీ మాకు అనుకూలంగా ఉందని నేను అనుకోనన్నారు. అందరికీ ఒకే విధమైన న్యాయం లభిస్తుందని.. మేము ఇతర జట్లకు భిన్నంగా ఎటువంటి లాభాన్ని పొందడం లేదని అన్నారు. క్రికెట్‌లో భారతదేశం పెద్ద పవర్‌హౌస్, కానీ అందరితోనూ తాము సమానమే అని రోజర్ బిన్నీ అన్నారు. ఇక 2023 ఆసియా కప్ కోసం భారత జట్టు పాకిస్థాన్‌కు వెళుతుందా అని ప్రశ్నించగా.. ఆ విషయం మా చేతుల్లో లేదని బిన్నీ తెలిపాడు. భారత్ జట్టు పాకిస్థాన్, ఇతర దేశాల పర్యటనపై బోర్డు సొంతంగా నిర్ణయాలు తీసుకోదని, ప్రభుత్వ నిర్ణయాలపైనే ఆదారపడుతుందని బిన్నీ తెలిపారు. ఇటీవల పాకిస్థాన్ మాజీ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై నడిరోడ్డుపై కాల్పులు జరిపిన ఘటన తెలిసి పాక్ కు భారత జట్టును పంపకూడదనే డిమాండ్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి.

    Trending Stories

    Related Stories