More

    మునుగోడు ఉప ఎన్నికలో రోడ్ రోలర్ గుర్తు రచ్చ

    మునుగోడు ఉప ఎన్నికలో గుర్తుల వివాదం కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి చేరింది. యుగ తుల‌సి పార్టీ అభ్య‌ర్థి శివ కుమార్ మొద‌ట‌గా త‌న‌కు రోడ్ రోల‌ర్ గుర్తును కేటాయించి ఆ త‌రువాత గుర్తు మార్చార‌ని ఫిర్యాదు చేశారు. గుర్తు మార్పు విష‌యాన్ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీవ్రంగా ప‌రిగ‌ణించింది. మునుగోడు రిట‌ర్నింగ్ అధికారి(ఆర్వో)పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఎందుకు గుర్తు మార్చాల్సి వ‌చ్చిందో ఆర్వో నుంచి వివ‌ర‌ణ తీసుకోవాల‌ని, ఆ నివేదిక‌ను సాయంత్రం 5 గంట‌ల లోపు పంపాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి(సీఈవో)ను ఈసీఐ ఆదేశించింది. ఈసీఐ ఆదేశాల నేప‌థ్యంలో ఫారం7(ఎ) ను ఎన్నిక‌ల అధికారులు స‌వ‌రించారు. శివ‌కుమార్‌కు తిరిగి రోడ్డు రోల‌ర్ గుర్తును కేటాయిస్తూ గెజిట్ నోటిఫికేష‌న్ జారీ చేశారు. అంతేకాకుండా రిటర్నింగ్ అధికారిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

    మునుగోడు రిటర్నింగ్ అధికారిపై వేటు వేసిన కేంద్ర ఎన్నికల సంఘం చర్యను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. మునుగోడు రిటర్నింగ్ అధికారి బదిలీ వ్యవహారంలో ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమని కేటీఆర్ అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ ఏ రీతిన దుర్వినియోగం చేస్తుందో తెలిపేందుకు ఇది మరో ఉదాహరణగా నిలిచిందని అన్నారు. 2011లోనే సస్పెండ్ చేసిన రోడ్డు రోలర్ గుర్తును తిరిగి కేటాయించడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేయడమేనని కూడా ఆయన అన్నారు. గతంలో తమ అభ్యర్థన మేరకు రోడ్డు రోలర్ గుర్తును ఎన్నికల సంఘం తొలగించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఒకసారి రద్దు చేసిన గుర్తును తిరిగి మరోమారు ఆ గుర్తును ఎన్నికల్లోకి ప్రవేశపెట్టడం ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు.

    Trending Stories

    Related Stories