రోడ్డు ప్రమాదానికి గురైన పద్మశ్రీ వనజీవి రామయ్య

0
726

ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బుధవారం ఉదయం ఖమ్మం రూరల్‌ మండలంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు రోడ్డు దాటుతుండగా రామయ్యను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో వనజీవి రామయ్యను ఖమ్మం ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పద్మశ్రీ వనజీవి రామయ్య ఆరోగ్యంపై ఎంపీ సంతోష్ కుమార్ ఆరా తీశారు. డాక్టర్ ల తో మాట్లాడిన ఎంపీ సంతోష్ కుమార్.. రామయ్య ఆరోగ్యం మెరుగు అయ్యేందుకు అవసరమైన అన్ని వైద్య చర్యలు తీసుకోవాలని సూచించారు. రామయ్యకు గతంలో ఇతర అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టాయి. ఆయనను రెస్ట్ తీసుకోమని వైద్యులు సూచించినా కూడా మొక్కల పెంపకం కోసం పరితపిస్తూనే ఉన్నాడు.