Telugu States

హీరో సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్

టాలీవుడ్ నటుడు, మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అయింది. హైదరాబాద్ లో స్పోర్ట్స్ బైక్ మీద వెళుతున్న సమయంలో సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అయిందని భావిస్తున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ అపస్మారకస్థితిలో ఉన్నారని తెలుస్తోంది. మాదాపూర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో సాయి ధరమ్ తేజ్ కు చికిత్స అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం స్కానింగ్ కోసం పంపించారని.. స్కానింగ్ రిపోర్ట్స్ కోసం వైద్యులు ఎదురుచూస్తున్నారని మీడియా సంస్థలు తెలిపాయి. కుడి కన్నుపై, ఛాతీ, పొట్ట భాగంలో తీవ్రగాయాలయినట్లు డాక్టర్లు తెలిపారు.

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్‌పై నుంచి అదుపుత‌ప్పి సాయి ధ‌ర‌మ్ తేజ్ కింద‌ప‌డిపోయాడని తెలుస్తోంది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయిధరమ్ తేజ్‌ను పోలీసులు మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కేబుల్ బ్రిడ్జ్ నుండి ఐకియా వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఓవర్ స్పీడ్ వల్ల ప్రమాదం జరిగిందని మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sai Dharam Tej 1

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

17 − sixteen =

Back to top button