హైదరాబాద్ లో మెట్రో పిల్లర్ ను ఢీకొట్టి ఇద్దరు యువకులు మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు మెట్రో పిల్లర్‌ను ఢీకొని మృతి చెందారు. హైదరాబాద్‌లోని సోమాజీగూడలో ఈ ఘటన చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన ఇద్దరు యువకులు మోహిన్ (23), ఒబేద్ (22) బైక్‌పై ఖైరతాబాద్ వైపు వెళ్తున్న సమయంలో సోమాజీగూడ హనుమాన్ దేవాలయం ఎదురుగా ఉన్న మెట్రోపిల్లర్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. యువకులిద్దరూ నగరంలోని వారి బంధువుల ఇంటికి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని గుర్తించారు.