National

రోడ్డు ప్రమాదంలో మిస్ సౌత్ ఇండియా, మిస్ కేరళ రన్నరప్ మృతి

కేరళలోని కొచ్చి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మాజీ మిస్ కేరళ అన్సీ కబీర్, మాజీ రన్నరప్ అంజనా షాజన్ మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు వైటీల్లా-పలరివట్టోమ్ జాతీయ రహదారి బైపాస్ లో ఓ మోటార్ సైక్లిస్టును తప్పించే క్రమంలో అదుపు తప్పి రోడ్డుపై పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో అన్సీ, అంజనా అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కారు డ్రైవర్ కు, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

అన్సీ కబీర్ 2019లో మిస్ కేరళ అందాల పోటీల్లో విజేతగా నిలిచింది. ఇదే పోటీల్లో అంజనా కబీర్ రన్నరప్ గా నిలిచారు. వారిద్దరూ మంచి మిత్రులని బంధువులు వెల్లడించారు. ప్రమాద సమయంలో డ్రైవర్ ఒక్కడే సీటు బెల్టు ధరించినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంతో అన్సీ, అంజనాల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదం జరగక కొన్ని నిమిషాల ముందు ఇంస్టాగ్రామ్ లో అన్సి ఇట్స్ టైం టు గో అంటూ ఓపోస్ట్ పెట్టారు. ఈ ఏడాది మిస్ సౌత్ ఇండియా గా అన్సీ కబీర్ సెలెక్ట్ గా కాగా 2019లో మిస్ కేరళ గా రన్నరప్ గా అంజనా షాజన్ నిలిచింది.

అన్సీ కబీర్ వయసు 25 సంవత్సరాలు. అన్సీ తిరువనంతపురం జిల్లాలోని అలంకోడ్‌కు చెందిన యువతి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో వైటీల్లా-పలరివట్టోమ్ మధ్య జాతీయ రహదారిపై హాలిడే ఇన్ హోటల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. అన్సీ, అంజన కాకుండా, త్రిసూర్ కు చెందిన అబ్దుల్ రెహమాన్, ముహమ్మద్ ఆసిఫ్ కూడా కారులో ఉన్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ ఎర్నాకులం మెడికల్ సెంటర్ ఆసుపత్రిలో చేర్పించారు. అన్సీ, అంజనలను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. సీసీటీవీ కెమెరాలను పోలీసులు తనిఖీ చేయగా, కారు అతివేగంతో ప్రయాణిస్తున్నట్లు, అకస్మాత్తుగా ముందున్న స్కూటర్‌ను తప్పించబోయి అదుపు తప్పినట్లు గుర్తించారు.

Related Articles

Back to top button