సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

0
751

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆర్టీసీ బ‌స్సు, కారు ఢీ కొన్నాయి. గురువారం ఉద‌యం ఆందోల్ మండ‌లం కన్సాన్‌పల్లి వద్ద నాందేడ్‌ – అకొలా జాతీయ రహదారిపై ఆర్టీసీ బ‌స్సు, కారు ఢీ కొన్నాయి. ఈ ప్ర‌మాదంలో కారులో ప్ర‌యాణిస్తున్న న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుల‌ను హైద‌రాబాద్‌లోని జీడిమెట్లకు చెందిన దిలీప్‌,వినోద‌, సుప్రసిత, చిన్నారి కాంక్షిత‌గా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని అధికారులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.