రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం

0
786

రాజ‌స్థాన్‌లోని బ‌ర్మేర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. బ‌ర్మేర్‌లోని ప‌చ్‌ప‌ద్ర ఏరియాలో ఆయిల్ ట్యాంక‌ర్, ప్ర‌యాణికుల‌తో వ‌స్తున్న బ‌స్సును ఢీకొట్టింది. ఆ వెంట‌నే ఆయిల్ ట్యాంక‌ర్ నుంచి పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. ఈ ప్ర‌మాదంలో బ‌స్సులోని 11 మంది ప్రయాణీకులు మృతిచెందారు. ప‌లువురికి తీవ్ర గాయాల‌య్యాయి. పోలీసులు హుటాహుటిన అక్కడికి వచ్చి క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టానికి పంపించారు. ప్ర‌మాదానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నార‌ని అధికారులు తెలిపారు. ఘ‌ట‌న‌పై రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు.

(26) PMO India on Twitter: “It is saddening that people have lost their lives due to a bus-tanker collision at the Barmer-Jodhpur Highway in Rajasthan. In this hour of grief, my condolences to the bereaved families. I pray that the injured have a quick recovery: PM @narendramodi” / Twitter

ఈ రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ రూ.2 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. గాయ‌ప‌డిన వారికి కూడా రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ మేర‌కు ప్ర‌ధానమంత్రి కార్యాల‌యం ట్విట్ట‌ర్‌లో ఒక ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌ధాన‌మంత్రి నేష‌న‌ల్ రిలీఫ్ ఫండ్ (పీఎంఎన్ఆర్ఎఫ్‌) నుంచి ఈ నిధుల‌ను అందించనున్న‌ట్లు వెల్ల‌డించింది.

(26) PMO India on Twitter: “An ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who lost their lives due to the accident at the Barmer-Jodhpur Highway in Rajasthan. The injured would be given Rs. 50,000 each: PM @narendramodi” / Twitter