పల్నాడులో ఘోర ప్రమాదం..!

0
652

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దాచేపల్లి మండలం పొందుగల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ నల్గొండ జిల్లాకు చెందిన వారు. గురజాల మండలం పులిపాడుకు వెళ్తుండగా వీరి ఆటోను లారీ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలో 23 మంది ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మృతి చెందిన వారంతా దామరచర్ల మండలం నరసాపురం గ్రామ వాసులు ఇస్లావత్ ముజుల, భూక్య పద్మ , పానియా సక్ర, భూక్య నాని, మాలావత్ కలిత, ఇస్లవత్ పార్వతిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.