ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లాలో నకరికల్లు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శాంతిపురం రహదారిపై అదుపు తప్పి లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. నరసరావుపేట వైపు నాపరాళ్లతో లారీ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నాపరాళ్ళు మీద పడి లారీలో ప్రయాణిస్తున్న ముగ్గురు కూలీలు మృతి చెందారు. వీరిని మాచర్ల పసర్లపాడుకు చెందిన అమారేసు శ్రీను, దొడ్డ భాస్కరరావు, రమావత్ మునినాయక్ గా గుర్తించారు. మృతదేహాలను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.