జనగామ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. జిల్లాలోని రఘునాథపల్లి మండలం గోవర్థనగిరి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. వరంగల్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న తవేరా వాహనం టైరు పగిలి డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. మృతులంతా వరంగల్ చింతల్ నగర్ కు చెందిన వారుగా గుర్తించారు.