ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నేపాల్ నుంచి గోవాకు బస్సు వెళ్తోంది. తెల్లవారుజామున 3.30 గంటలకు బారాబంకిలోని మన్హుంగుపూర్ ప్రాంతంలో వేగంగా వెళ్తున్న ట్రక్కు ఈ డబుల్ డెక్కర్ బస్సును ఢీకొట్టింది. బస్సు కు పంక్చర్ అయిన టైరును డ్రైవర్ మారుస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా వస్తున్న లారీ బస్సును ఢీకొట్టింది. బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు.
రాంనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన 14 మందిని జిల్లా ఆసుపత్రికి తరలించారు తీవ్రంగా గాయపడిన ఇద్దరిని లక్నో ట్రామా సెంటర్‌కు రిఫర్ చేశారు. “పంక్చర్ అయిన టైర్‌ను మార్చడానికి బస్సును నిలిపి ఉంచారు. ఆ సమయంలో దానిని మరొక వాహనం ఢీకొట్టింది. సుమారు 14 మంది గాయపడ్డారు. చికిత్స సమయంలో, 4 మరణించారు, ఇద్దరిని ట్రామా సెంటర్‌కు రెఫర్ చేశారు. బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు, వారిని వెనక్కి పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ” అని అడల్ ఎస్పీ (నార్త్) బారాబంకి, పూర్ణేందు సింగ్ చెప్పారు. బస్సులో ప్రయాణిస్తున్న వారందరూ నేపాల్ నుంచి గోవాకు పని నిమిత్తం వెళ్తున్న కూలీలుగా చెబుతున్నారు.