More

    అనకాపల్లిలో అదుపుతప్పిన కారు.. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో ఘోర ప్రమాదం..!

    అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై వేగంగా దూసుకుపోతున్న కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందగా మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసులు ఈ ప్రమాదంపై సమాచారం అందగానే ఘటన స్థలానికి చేరుకున్నారు.. ఐతే పాయకరావుపేట వద్ద జాతీయ రహదారి పక్కన ఆగివున్న లారీని కారు ఢీ కొట్టింది. విజయవాడ నుండి విశాఖపట్నం వెళుతున్న కారు సీతారాంపురం జంక్షన్ వద్దకు రాగానే అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. ఆగి ఉన్న లారీని వేగంగా వెళ్ళి ఢీకొట్టడంతో కారులోని ఐదుగురు అందులోనే చిక్కుకున్నారు.

    పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారులో చిక్కుకున్న వారిని కాపాడారు. అప్పటికే ఒకరు మృతిచెందగా మరో ఐదుగురు తీవ్ర గాయాలతో ఉన్నారు. వారిని వెంటనే అంబులెన్స్ లో తుని హాస్పిటల్ కు తరలించారు. గాయపడిన వారి పరిస్థితి అత్యంత విషమంగా వున్నట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

    Trending Stories

    Related Stories