అలా ప్రధాని మోదీని కలిసిన రిషి.. ఇలా 3,000 వీసాలు ఇవ్వడానికి అనుమతి

0
809

భారత ప్రధాని నరేంద్ర మోదీ యూకే ప్రధాన మంత్రి రిషి సునక్ ను కలిశారు. బాలిలోని జీ 20 సదస్సుకు ఆయా సభ్య దేశాల అధినేతలు హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి రోజునే వీరిద్దరి కలయిక జరిగింది. ప్రధాని మోదీతో రిషి సునాక్ కలిసి మాట్లాడారు. ఈ సదస్సులో మోదీ కనిపించగానే రిషి సునాక్ స్వయంగా వచ్చి పలకరించారు. ఈ సందర్భంగా ఇరువురు చాలా విషయాలను మాట్లాడుకున్నారు.

ఈ భేటీ తర్వాత యూకే కీలక నిర్ణయం తీసుకుంది. యూకే ప్రధానమంత్రి కార్యాలయం బుధవారం వీసాలకు సంబంధించి కీలక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌లో “ఈ రోజు UK-ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్‌ను ధృవీకరించింది, డిగ్రీ-విద్యావంతులైన 18-30 సంవత్సరాల వయస్సు గల భారతీయ పౌరులు రెండు సంవత్సరాల వరకు జీవించడానికి, పని చేయడానికి UK కి రావడానికి 3,000 స్లాట్స్ ను అందిస్తోంది.” అని తెలిపింది. G20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని UK ప్రధాని రిషి సునక్ కలిసిన తర్వాత ఈ ప్రకటన వెలువడటం విశేషం. ప్రతి ఏడాది 3000 మందికి ఉద్యోగావకాశాల కోసం యూకే వీసాలు ఇవ్వనుంది.