More

    విదేశాల్లో హతమవుతున్న ఖలిస్తానీలు..!పంజాబ్‎లో ప్రకంపనలు..!! అసలేం జరుగుతోంది..?

    వాంట్స్ ఆర్ అన్ లిమిటెడ్. వాంట్స్, ఎఫర్ట్, శాటిస్ఫాక్షన్.. ఇది ఎకనమిక్ సైకిల్. సహేతుకమైన కోరిక సమంజసమే. ఎగెనెస్ట్ టు వాంట్స్ అని ఎవరైనా నిర్ణయించుకుంటే.. అది ఎకనామిక్ థీయరీకే ఎగినెస్ట్ అవుతుంది. ఒక వస్తువు కొనాలని మదిలో ఆలోచన రావడం.. దానిని సాధించడానికి ప్రయత్నం కొనసాగించడం, ఆ వస్తువు సాధించుకున్నాక సంతృప్తి పడడం..తిరిగి కొత్త కోరిక, కొత్త ప్రయత్నం..సంతృప్తి.. ఈ సర్కిల్ తిరుగాడుతూ వుండడం ఎకనామిక్స్ సిద్ధాంతమే. అయితే, అసహజ కోరికలు, అన్యాయపు ఆలోచనలు సాగించి అసంబద్ధ చర్యలకు పాల్పడితే.. అది అనర్ధాలకు దారితీస్తుంది. మిత్రులారా ఈ అంశాన్ని చూసే ముందు మీరు చేయాల్సి పని గుర్తుంది కదా..! మన గ్రూపాఫ్ ఛానెల్స్ ను సబ్ స్క్రయిబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. పదిమందికీ ఈ వీడియోను షేర్ చేసి జాతీయవాద జర్నలిజానికి మద్దతు తెలపండి.

    అఖండ భారతంలో అందరు కలిసిమెలిసి నిక్షేపంగా జీవిస్తుండగా.. వ్యాపారం పేరిట దాపురించిన ఆంగ్లేయులు పాలనా పగ్గాలు చేపట్టి అధ్వాన్న పరిస్థితులు కల్పించారు. అతివాదులు, మితవాదులు, అహింసావాదులు.. అంటూ ఎన్నో మార్గాల్లో పోరాటాలు చేసి.. స్వాతంత్ర్య సముపార్జన గమ్య లక్ష్యాన్ని సాధించారు. అనంతరం హిందుస్థాన్, పాకిస్థాన్ గా పవిత్ర దేశం రెండు ముక్కలైంది. ఆ సందర్భంలో భారత్ , పాకిస్థాన్ రెండుగా విడిపోవడాన్ని యావత్ భారత జాతి నిరసించింది. సిక్కు సోదరులు ఈ చర్యను తీవ్రంగా నిరసించారు. దేశ విభజన అనంతరం పాకిస్థాన్ లో వున్న అనేక మంది భారతీయులు భారత్ కు వచ్చారు. పాకిస్థాన్ నుంచి నాడు అధికసంఖ్యలో సిక్కులు సైతం భారత్ కు వలస వచ్చారు. వలస వచ్చిన చాలామంది సిక్కులు దేశంలోని వాయివ్య ప్రాంతంలో స్థిరపడ్డారు. అందుకే తూర్పు పంజాబ్ లో సిక్కుల జనాభా పెరిగింది. పాక్ తరహా బుద్ధి కొందరు సిక్కుల మదిలోనూ మెదిలింది. అన్నదమ్ముల్లా కలిసిమెలసి వుంటుండగా.. ఈ అనుబంధానికి విఘాతం కల్గించాలని.. ఎవరో జ్వాలను రగిలించారు. అది రావణకాష్టంలా మారడానికి కొందరు ప్రయత్నించారు. అమాయక సిక్కు ప్రజలను ఉత్తపుణ్యాన ఉసిగొల్పారు. ఈ నేపథ్యంలో పుట్టుకొచ్చిందే ఖలిస్థాన్ ఉద్యమం. పంజాబీ భాషలో ఖల్సా అంటే పవిత్రమైన అని అర్థం. ఇందులోంచి ఉద్బవించిందే ఖలిస్థాన్. అతి పవిత్రమైన భారత భూమిలో.. ప్రత్యేకించి ఖలిస్థాన్ ఏమిటి..? ఉద్యమాలు ఏమిటి.. అని దేశ ప్రజలు మధనపడుతున్నారు. సిక్కులకు ప్రత్యేక దేశం ఏర్పాటే దీని లక్ష్యం అని ఖలిస్థాన్ ఉద్యమ నేతలు అంటున్నారు. భిన్న భాషలతో, భిన్న సంస్కృతులతో, విభిన్న నాగరికతలతో.. కలిసి మెలిసి జీవిస్తూ.. ఐక్యతా రాగాన్ని ఆలపిస్తూ.. అందరూ సుఖ సంతోషాలతో జీవిస్తూ.. ప్రపంచ వ్యాప్త కీర్తి ప్రతిష్ఠలు పొందుతున్న భారత్ లో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయేమిటని.. అసలు సిసలు దేశభక్తులు ఆవేదన చెందుతున్నారు.

    దీర్ఘకాలంగా సిక్కులను రెచ్చకొట్టబోయి భంగపడిన పాకిస్థాన్, ఇప్పుడు ఖలిస్థాన్ ఉద్యమానికి ఊపిరి అందిస్తోంది. చినికి చినికి గాలి వానగా మారిన సిక్కు మత ఖలిస్తాన్ ఉద్యమం పంజాబ్ లో తారాస్థాయికి చేరుకుంటోంది. ఈ ఉద్యమ వేరులను దశ దిశలా వ్యాపింప చేసి.. విశ్వవ్యాప్తం చేయడానికి ఖలిస్థాన్ ఉద్యమ నేతలు సమాయత్తం అయ్యారు. ఒకప్పుడు పంజాబ్ లో సిక్కుల జనాభా కంటే హిందువుల జనాభా అధికంగా వుండేది. ఒక్క లూధియానా జిల్లాలో మాత్రమే కాస్త ఎక్కువగా.. దాదాపు 41.6 శాతం మంది సిక్కులు వుండేవారు. అలాంటిది.. ఇప్పుడు ఏకంగా భారత దేశం నుంచి విడివడి సిక్కు దేశంగా ఏర్పడతామని..పోరాటాలు సాగిస్తున్నారు. ఇది ఎంతో శోచనీయ విషయం.

    ఈ విపత్కర పరిస్థితులు శాంతిభద్రతల సమస్యలు తలెత్తేలా చేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో పలు నేరాల్లో, తీవ్రవాద చర్యల్లో ప్రమేయం వున్న ఖలిస్థానీ ఉగ్రవాది, గ్యాంగ్ స్టర్ హర్విందర్ సింగ్ రిండా మృతి చెందాడు. పంజాబ్ లో కనీసం 10 ఉగ్రవాద ఘటనల్లో రిండాకు ప్రమేయం వున్నట్టు వెల్లడైంది. ఈ ఏడాది మేలో పంజాబ్ పోలీస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన ఆర్పీజీ దాడిలో ఇతని ప్రమేయం వుందని తెలిసింది. మూత్ర పిండాల సమస్య తో లాహూర్ ఆసుపత్రిలో చేరినట్టు తొలుత వార్తలు వచ్చాయి. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రిండా మృతి చెందినట్టు వెల్లడైంది . అయితే, రిండా మృతి వెనుక ఐఎస్‌ఐ హస్తం వుండవచ్చని పంజాబ్ పోలీస్ ఇంటిలిజెన్స్ అధికారులు అంటున్నారు. మరోవైపు డ్రగ్ ఓవర్ డోస్ కారణంగా ఆయన మరణించినట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ ఘటన అనంతరం రిండా సహచర గ్యాంగ్ స్టర్ హ్యాపీ సంఘేరా ఇటలీలో హత్యకు గురయ్యాడు. మరో ఖలిస్థాని ఉగ్రవాది కుల్విందర్ జిత్ సింగ్ ఎలియాస్ ఖాన్ పురియా థాయ్ లాండ్ లో బహిష్కరణ వేటుకు గురయ్యాడు.

    మరోవైపు పంజాబ్‌కు చెందిన శివసేన నేత సుధీర్ సూరి హత్యకు గురయ్యారు. గోపాల్ టెంపుల్ సమీపంలోని మజీతా రోడ్డు వద్ద గుర్తుతెలియని వ్యక్తి సుధీర్‌పై కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు. ఆలయం వెలుపల ఉద్ధవ్ థాకరే శివసేన వర్గానికి చెందిన కొందరు నేతలు నిరసన తెలుపుతుండగా అక్కడి గుంపులోంచి ఒక వ్యక్తి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. కాల్పులకు ఉపయోగించిన ఏ 30 తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. షూటింగ్ ప్రదేశం వద్ద ఒక వ్యక్తి కాల్పులు జరుపుతూ కెమెరాకు చిక్కాడు. కాగా, ఇద్దరు వ్యక్తులు కారు నుంచి దిగి కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. కాల్పుల ఘటన అనంతరం స్థానిక నేతలు నిరసనలకు దిగారు. ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి నుంచి పంజాబ్‌లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని శివసేన పంజాబ్ అధ్యక్షుడు యోగిరాజ్ శర్మ విమర్శించారు.

    ఇదిలావుంటే, పంజాబ్ లో సుధీర్ సూరి హత్యకు తామే బాధ్యులమంటూ జస్టిస్ లీగ్ ఇండియా అనే ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా హిందూ నాయకులు, ఆరెఎస్స్ నేతలు, హిందుబంధువులపై ఈ సంస్థ విషం కక్కింది. తాము గతంలొ హిందూ నాయకులను హతమారుస్తామని చెప్పినట్లుగానే సుధీర్ సూరిని హత్య చేశామని ప్రకటించింది. ఇది ఆరంభం మాత్రమే అని.. ఇంకా ఎన్నో దాడులకు పాల్పడతామని నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ప్రకటించింది.

    మరోవైపు ఖలిస్థాన్ అనుకూల గ్రూప్ సిక్స్ ఫర్ జస్టీస్ కెనడా బ్రాంప్టన్ లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టంది. కెనడియన్ సిక్కులు దాదాపు లక్ష మంది ఈ సందర్భంగా SFJ నిర్వహించిన ఓటింగ్ లో పాల్గొంది. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న SFJని 2019లో భారత ప్రభుత్వం నిషేధించింది. దేశానికి వ్యతిరేకంగా కెనడాలో జరుగుతున్న ఈ రిఫండంపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. భారత్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ చర్యలను అడ్డుకోవాలని కెనడాకు భారత ప్రభుత్వం సూచించింది. అయితే, భారత్ అభిప్రాయాన్ని కెనడా సున్నితంగా తిరస్కరించింది. శాంతియుతంగా భావ వ్యక్తీకరణ చట్టపరిధిలో చేస్తుంటే..తాము జోక్యం చేసుకోలేమని కెనడా తెలిపింది. పంజాబ్ ప్రజల్లో ఏకాభ్రిప్రాయం కుదిరితే అప్పుడు తాము ముందుకు అడుగులు వేస్తామని SFJ తెలియజేసింది. ఈ రెఫరెండంను ఉటంకిస్తూ..SFJ ఫస్ట్ పోస్ట్ పెట్టింది.

    భారతదేశం స్వాతంత్ర్యదినోత్సవ సంబరాలు నిర్వహించుకుంటున్న ఆగస్ట్ నెలలో.. శాన్‌ ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం గోడలపై ఖలిస్థానీ నినాదాలను పెయింట్‌తో రాశారు. ‘ఖలిస్థాన్ జిందాబాద్’ అని గోడలపై రాసిన స్లోగన్లకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవాలు నిర్వహిస్తున్న వేళ ఖలిస్థానీ గ్రూప్ ఈ రెచ్చగొట్టే స్లోగన్లు రాసింది. కాగా, కీలక ప్రదేశాల్లో ఖలిస్థానీ జెండాలను ఎగురవేస్తే బహుమతి ఇస్తానని ఖలిస్థానీ నేత గుర్‌పట్వంత్ సింగ్ పన్ను ఇటీవల ప్రకటించారు.

    ఇక కుక్కతోక వంకర దేశానికి వక్రబుద్ధులు తప్ప మంచి బుద్దులు ఎలా వుంటాయి. భారత్ లోని పంజాబ్ పరిణామాలను పాకిస్థాన్ గూడచార సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటిలిజెన్స్ తనకు అనుకూలంగా మార్చుకుందామని భావిస్తోంది. చీకటి వ్యవహారాలు సాగించడానికి ఎత్తుగడలు వేస్తోంది. కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతలు చేపట్టిన ఉద్యమం ద్వారా దేశీయంగా అలజడులు సృష్టించడానికి ఐఎస్ఐ ప్రయత్నించి భంగపడింది. ఖలిస్థానీ ఉద్యమాన్ని పునరుద్దరించడానికి ఐఎస్ఐ పావులు కదిపిందనే వాదనలు వున్నాయి. భారత గణతంత్ర ఉత్సవాల రోజున ఢిల్లీ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు వెనక ఐఎస్ఐ హస్తం ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి.

    ఖలిస్తానీ ఉగ్రవాదులు పంజాబ్ లో విజృంభించడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఖలిస్తానీ ఉగ్రవాదుల నుంచి గత ఎన్నికల్లో నిధులు పొందారనే అనుమానాలు సైతం వ్యక్తమయ్యాయి. పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఖలిస్థాన్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. హత్యలకు సైతం తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సుధీర్ సూరికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయినా ప్రభుత్వం సరైన రక్షణ కల్పించడంలో విఫలమవడంతో సుధీర్ సూరి హత్యకు దారితీసింది. పంజాబ్ లో రోజురోజుకీ పెరిగిపోతున్న ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని, గ్యాంగ్ స్టర్ల రాజ్యాన్ని నిర్మూలించడానికి పంజాబ్ ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు చేపట్టకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నెట్టింట, అన్నింటా కామెంట్లు వస్తున్నాయి.

    Trending Stories

    Related Stories