అయ్యయ్యో.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో కూడా రిగ్గింగ్ అట..!

0
906

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా ఈనెల 17న అధ్యక్ష ఎన్నికల కోసం ఓటింగ్ నిర్వహించింది కాంగ్రెస్. ఆయా రాష్ట్రాల పీసీసీ కార్యాలయంలో పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. మొత్తం 9వేల మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో అభ్యర్థుల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి ఓట్లను లెక్కిస్తున్నారు. ఎవరికైతే 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తాయో.. వారిని విజేతగా ప్రకటించనుంది కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం. అయితే ఈ ఎన్నికల్లో కూడా రిగ్గింగ్ ఆరోపణలు వచ్చాయి.

అధ్యక్ష రేసులో ఉన్న శశిథరూర్‌ ఏజెంట్ సంచలన కామెంట్స్‌ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేశారు. పెద్ద ఎత్తున రిగ్గింగ్‌ కూడా జరిగిందని ఆరోపిస్తూ.. కాంగ్రెస్‌ ఎలక్షన్‌ చైర్మన్ మధుసూధన్ మిస్త్రీకి శశి థరూర్ ఏజెంట్‌ సల్మాన్‌ సోజ్‌ ఫిర్యాదు చేశారు. అక్రమాలకు సంబంధించి ఫోటోలు, ఆధారాలను కూడా సమర్పించారు.