More

    భారత సైన్యానికి క్షమాపణలు చెప్పిన నటి రిచా చద్దా

    బాలీవుడ్ నటి రిచా చద్దా భారత సైన్యానికి క్షమాపణ చెప్పింది. గాల్వాన్‌పై ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపడంతో రిచా చద్దా క్షమాపణలు కోరింది. ఎవ్వరినీ నొప్పించే ఉద్దేశం తనకు లేదని, తన ట్వీట్ వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమాపణలు కోరుతున్నానని వివరణ ఇచ్చింది. తాను దురుద్దేశపూర్వకంగా ఈ ట్వీట్ చేయలేదని చెప్పింది. తన తాత లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో భారత సైన్యంలో పని చేశారని తెలిపింది. భారత్-చైనా యుద్ధంలో ఆయన కాలికి బుల్లెట్ కూడా తగిలిందని చెప్పింది. తన మావయ్య ఓ పారా ట్రూపర్ గా పని చేశారని, తమది సైనికుల కుటుంబమని తెలిపింది.

    అప్పట్లో గాల్వాన్ ఘ‌ట‌న‌పై బాలీవుడ్ న‌టి రిచా చ‌ద్దా చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది ప్రకటించగా.. ఆ ట్వీట్ కు రిచా.. గాల్వాన్ హాయ్ చెప్తోందని కామెంట్ చేశారు. ఆమె చేసిన పోస్ట్ భార‌త ఆర్మీని చుల‌క‌న చేసిన‌ట్లు ఉందని పలువురు విమర్శలు గుప్పించారు. ఆ వ్యాఖ్యలు సిగ్గుచేటు, అవ‌మాన‌క‌రమని మరికొంద‌రు కామెంట్ చేశారు. 2020 మేలో గాల్వాన్‌లో చైనా, భార‌తీయ ఆర్మీ ద‌ళాల మ‌ధ్య ఘ‌ర్షణ జరిగి 20 మంది భార‌తీయ సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. రిచా చేసిన ట్వీట్ ఆ గాల్వాన్ అమ‌ర‌వీరుల‌ను అవ‌మాన‌ప‌రిచిన‌ట్లు ఉంద‌ని తీవ్ర విమర్శలు వచ్చాయి.

    Trending Stories

    Related Stories