Telugu States

ఈటల రాజేందర్ పై వైరల్ అవుతున్న మెసేజీపై స్పందించిన వర్మ

హుజూరాబాద్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం హోరుగా సాగుతోంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను గెలిపించుకోడానికి ఆ పార్టీ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కూడా తమ అభ్యర్థుల విజయం కోసం ప్రణాళికలు రచిస్తూ ఉన్నాయి. అయితే ఈటల రాజేందర్ పై కొన్ని మెసేజీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేరు కూడా చేర్చి ఒక మెసేజీని షేర్ చేస్తూ ఉన్నారు. ఆ మెసేజీ రామ్ గోపాల్ వర్మ దాకా వెళ్ళింది. దీంతో ఆ మెసేజీపై వర్మ స్పందించారు.

ఈటల రాజేందర్ అంశానికి, టీడీపీ అధినేత చంద్రబాబుకు ముడిపెడుతూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేరిట ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. దానిపై వర్మ స్పందించారు. అది తాను చేసిన ట్వీట్ కాదని, అది ఫేక్ అని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యవహారానికి, చంద్రబాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యవహారం ఒకేలా అనిపిస్తున్నాయంటూ వర్మ తెలిపినట్టుగా ఆ ట్వీట్ ఉంది. దీనిపై అందరితో చర్చించి “వెన్నుపోటు ఈటలు” అనే సినిమా తీద్దామని నిర్ణయించుకున్నట్టు ఆ పోస్టులో వర్మ వివరించినట్టు తెలిపారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఆ ట్వీట్ ను కూడా వర్మ పంచుకున్నారు.


https://twitter.com/RGVzoomin/status/1451153988351520768

ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాలపై కూడా వర్మ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఏపీలో ఉద్రిక్త పరిస్థితులపై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. “ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే… త్వరలోనే ఏపీ రాజకీయ నాయకులు బాక్సింగ్, కరాటే, కర్రసాము తదితర విద్యలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది” అని అన్నారు.

Related Articles

Back to top button