More

    తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి

    తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నియమించింది. పార్టీ సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవిని సొంతం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎలా నడిపిస్తారు అనే ప్రశ్నలు వెంటాడుతూ ఉన్నాయి. మరో వైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనే ఎన్నో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమించకూడదని ఇప్పటికే పలువురు సీనియర్లు బహిరంగంగా విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అధిష్టానం రేవంత్ రెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించడంతో పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశం కూడా ఉంది.

    కాంగ్రెస్ హైకమాండ్ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఐదుగురిని నియమించింది. జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజారుద్దీన్, మహేశ్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ లను కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమిస్తూ ప్రకటనను విడుదల చేసింది. పీసీసీ ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్, దామోదర్ రెడ్డి, మల్లు రవి, పోదెం వీరయ్య, సురేశ్, వేం నరేందర్ రెడ్డి, రమేశ్ ముదిరాజ్ లను నియమించింది.

    మరోవైపు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీతారావు (సునీతా మోగ్లీ ముదిరాజ్) నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు. నేరెళ్ల శారద రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగగా.. ఆ స్థానంలో సునీత బాధ్యతలు స్వీకరించనున్నారు. హైకోర్టు న్యాయవాది అయిన సునీత ఎన్ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌లో పనిచేశారు. హైదరాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, పీసీసీలో వివిధ పదవుల్లో ఆమె పనిచేశారు.

    Trending Stories

    Related Stories