నుపుర్‎కు మాజీ జడ్జీల మద్దతు..! హత్య చేయాలన్న సల్మాన్ అరెస్ట్..!!

0
746

ఉన్నమాట అంటే ఉలుకు ఎక్కువ అనే మాట ఇక్కడ సరిగ్గా సరిపోతుందేమో..! మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను ముస్లిం వర్గం ఇంకా వదలడం లేదు. నోటికి వచ్చినట్లు నుపుర్ శర్మను విమర్శిస్తూ అబాసుపాలు అవుతున్నారు. ఆఖరికి అత్యున్నత న్యాయస్థానాలు కూడా నుపుర్ శర్మపై మండిపడటం చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాల హైకోర్టు మాజీ న్యాయమూర్తులు దీనిపై స్పందించారు. బీజేపీ మాజీ ప్రతినిధి నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల మీద మాజీ న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు, సైనికాధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దానిపై సీజేఐ జస్టిస్ రమణకు బహిరంగ లేఖ రాశారు. అందులో సుప్రీంకోర్టు లక్షణ రేఖను అధిగమించిందని ఆరోపించారు. ఆ వ్యాఖ్యలకు ఉపసంహకరించుకునేలా ఆదేశించాలని కోరారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలు, దేశ భద్రతపై ఇవి తీవ్రమైన పరిణామాలను వేసే ఛాన్స్ ఉన్నందున, తక్షణ దిద్దుబాటు చర్యలు అవసరమని లేఖలో చెప్పారు.

అంతేకాదు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పార్దీవాలా బెంచ్ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేశాయని, దేశంలో జరుగుతున్న పరిణామాలకు ఆమె ఒక్కరే బాధ్యులని మాట్లాడడం హేతుబద్ధంగా లేదని లేఖలో వెల్లడించారు. కోర్టు నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం సరికాదని, ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు.. ఆమె పిటిషన్‌తో సంబంధం లేకుండా ఉన్నాయని అన్నారు. పైగా కోర్టును ఆశ్రయించిన నుపుర్ శర్మకు న్యాయ సహాయాన్ని తిరస్కరించడం మాయని మచ్చ అని లేఖలో స్పష్టం చేశారు. ఈ పరిణామం ప్రజాస్వామ్య విలువలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ లేఖపై 15 మంది విశ్రాంత న్యాయమూర్తులు, 77 మంది బ్యూరోక్రాట్లు, 25 మంది మాజీ సైనికాధికారులు సంతకాలు చేశారు.

సంతకం చేసిన వారిలో బాంబే హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి క్షితిజ్ వ్యాస్, గుజరాత్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్ఎం సోనీ, రాజస్థాన్ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు ఆర్‌ఎస్ రాథోడ్, ప్రశాంత్ అగర్వాల్, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్‌ఎన్ ధింగ్రా కూడా ఉన్నారు. నిజానికి మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ తన ప్రాణాలకు ముప్పు ఉందని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులన్నింటిని ఢిల్లీకి బదిలీ చేయాలని పిటిషన్ వేశారు. దానిపై విచారించిన కోర్టు ఆమెపై మండిపడింది. నుపుర్ శర్మ కామెంట్స్ వల్ల దేశ భద్రతే ప్రమాదంలో పడిందని వ్యాఖ్యానించింది. దేశంలో జరుగుతున్న ఘటనకు ఆమే బాధ్యురాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. దానిపై దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది.

మరోవైపు బీజేపీ బహిష్కృత నాయకురాలు నుపుర్ శర్మను శిరచ్ఛేదనం చేసిన వారికి తన ఇల్లు రాసిస్తానంటూ అజ్మీర్ వాసి ప్రకటించాడు. ఈ ఆఫర్‌ను ప్రకటించిన వ్యక్తిని రాజస్థాన్‌లోని అజ్మీర్ పట్టణానికి చెందిన సల్మాన్ చిస్తీగా గుర్తించారు. ఎవరైనా సరే నుపుర్ శర్మ తలను తీసుకొస్తే తన ఆస్తులను ఇచ్చేస్తానని సల్మాన్ చెబుతున్నట్టు ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ముస్లింలను హింసిస్తున్నారని, చంపుతున్నారని అతను ఆరోపించాడు. దీనిపై పోలీసులు స్పందించారు. సల్మాన్ మత్తులో మాట్లాడినట్టు ఉందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సల్మాన్ చిష్టీని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. సల్మాన్ చేసిన కామెంట్లకుగానూ అతనిని అరెస్టు చేసిన ఏఎస్పీ వికాస్ సంగ్వాన్ తెలిపారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

eight − eight =