More

    పబ్లిక్ ప్లేస్ లో నమాజ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న హిందువుల అరెస్టు

    బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ లకు వ్యతిరేకంగా హిందువులు గురుగ్రామ్ లో నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తూ ఉన్నారు. డిసెంబర్ 3న శుక్రవారం నమాజ్ చేయడానికి గురుగ్రామ్‌లోని సెక్టార్ 37లోని పబ్లిక్ గ్రౌండ్‌లో పెద్ద సంఖ్యలో ముస్లింలు వచ్చారు. దీంతో స్థానిక నివాసితులు, వివిధ హిందూ సంస్థల సభ్యులు మరోసారి నిరసనను ప్రారంభించవలసి వచ్చింది.

    శుక్రవారం నమాజ్ చేయడానికి పబ్లిక్ గ్రౌండ్‌కు చేరుకున్న ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు ‘జై శ్రీరామ్’ మరియు ‘వందే మాత్రం’ నినాదాలు చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. గురుగ్రామ్ పోలీసులు, ముస్లింలను బహిరంగ ప్రదేశంలో నమాజ్ చేయడాన్ని ఆపడానికి బదులుగా హిందువులను అక్కడి నుండి నెట్టివేశారు. ముస్లింలు నమాజ్‌ను అడ్డుకోకుండా నిరసనకారులను దూరంగా ఉంచడానికి పోలీసులు ప్రయత్నించారు.

    ఆ ప్రదేశంలో నమాజ్ నిర్వహించకూడదని ముస్లింలకు తెలియజేయడానికి కొన్ని హిందూ సంస్థలకు చెందిన సభ్యులు ముస్లింలను సంప్రదించినప్పుడు, గురుగ్రామ్ పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుండి తీసుకుని వెళ్తున్న వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. గురుగ్రామ్‌లోని సెక్టార్ 37లోని ఖాన్‌స్డా గ్రామంలో ఉన్న ఈ మైదానం వాణిజ్య వాహనాలను పార్కింగ్ చేయడానికి క్రమం తప్పకుండా ఉపయోగించబడుతున్నప్పటికీ, కొన్ని మీడియా సంస్థలు చాలా మంది నిరసనకారులు తమ ట్రక్కులను పార్కింగ్ చేసి నిరసన తెలియజేశారని నివేదించాయి. గురుగ్రామ్ పోలీసులు ఈ శుక్రవారం సెక్టార్ 37లో ముస్లింలను నమాజ్ చేయకుండా నిరోధించడానికి ప్రయత్నించిన దాదాపు 50 మందిని హిందువులను అదుపులోకి తీసుకున్నారని తెలిపాయి.

    శుద్ధి కార్యక్రమం:

    గత వారం, గురుగ్రామ్‌ సెక్టార్ 37లోని ఖాన్‌స్డా గ్రామ నివాసితులు, వివిధ హిందూ సంస్థల సభ్యులతో కలిసి నవంబర్ 19 న శుక్రవారం నమాజ్ చేయడానికి వచ్చిన ముస్లింలు మైదానంలో క్రికెట్ ఆడుతున్న అబ్బాయిలతో అనుచితంగా ప్రవర్తించిన ప్రదేశంలో హవన్ ఆచారాన్ని నిర్వహించారు. నవంబర్ 19 న, శుక్రవారం నమాజ్ చేయడానికి పెద్ద సంఖ్యలో ముస్లింలు బహిరంగ మైదానంలోకి వచ్చిన తర్వాత సెక్టార్ 37 స్థానిక నివాసితులు నిరసన వ్యక్తం చేశారు.

    ఈ మైదానంలో వాణిజ్య వాహనాలు పార్క్ చేయబడి ఉన్నాయి. స్థానిక యువకులు అక్కడ క్రికెట్ ఆడతారు. మైదానంలో క్రికెట్ ఆడుతున్న గ్రామానికి చెందిన అబ్బాయిలతో ముస్లింలు అసభ్యంగా ప్రవర్తించారని ఖాన్‌స్డా నివాసితులు ఆరోపించారు. అందువల్ల, తాము తమ గ్రామంలోని మైదానంలో ఎటువంటి వాటికి అనుమతించమని చెప్పుకొచ్చారు. ముస్లింలు నమాజ్ చేయడానికి రావడంతో క్రికెట్ ఆడుతున్న యువకులు తమ గ్రామం మైదానాన్ని ఖాళీ చేసేందుకు నిరాకరించారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసి.. నమాజ్ చేసేందుకు బహిరంగ స్థలాలను ఆక్రమించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సెక్టార్ 10, సెక్టార్ 37కు స్థానిక పోలీసులు చేరుకుని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు. సెక్టార్ 10లోని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినప్పుడు సుమారు గంటపాటు ప్రతిష్టంభన కొనసాగింది.

    Trending Stories

    Related Stories