ఆర్బీఐ అనూహ్య నిర్ణయం.. పెరగనున్న వాటి ధరలు

0
876

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బం పెరగడం, అంతర్జాతీయ పరిస్థితులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఆర్‌బీఐ రెపో రేటును 40 బేసిస్ పాయింట్లను పెంచింది.

రెండు రోజుల నుంచి సమావేశమవుతున్న మానిటరీ పాలసీ కమిటీ రెపో రేట్లను పెంచేందుకు మొగ్గు చూపినట్టు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం, అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఆంక్షల నేపథ్యంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఈ కారణంగానే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం నెమ్మదించిందని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలాకాలం తరువాత రెపో రేట్లు పెంచింది. చివరగా ఆగస్టు 2018లో రెపో రేట్లును పెంచింది.

ఆర్థిక వృద్ధిని బలోపేతం చేసే లక్ష్యంతో వడ్డీ రేట్లను పెంచినట్టు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. మధ్యకాలిక ఆర్థిక వృద్ధి అవకాశాలను బలోపేతం చేయడం, ఏకీకృతం చేయడం లక్ష్యంగా వడ్డీ రేటు పెంచినట్టు వెల్లడించారు. SDF 4.15 శాతానికి, MSF 4.65 శాతానికి సర్దుబాటు చేయబడిందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. మార్చిలో సీపీఐలో స్పైక్‌ ఉందని, ఏప్రిల్‌లో సీపీఐ ఎగబాకుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. అనుకూలమైన ఆర్థిక పరిస్థితులను ప్రోత్సహించడంలో మానిటరీ విధానం కొనసాగుతుందని ఆర్‌బిఐ గవర్నర్ వెల్లడించారు. ఈ క్లిష్ట సమయంలో వాస్తవాలను అర్థం చేసుకోవడం అవసరమని శక్తికాంత దాస్ తెలిపారు. ఇటీవలి జిడిపి గణాంకాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగాన్ని కోల్పోతున్నాయని సూచిస్తున్నాయని చెప్పారు. CRR పెంపు రూ. 83711.55 కోట్ల లిక్విడిటీని తీసుకుంటుందని.. మే 21 అర్ధరాత్రి నుండి ఈ నిష్పత్తి అమల్లోకి వస్తుందని శక్తికాంత దాస్ తెలిపారు. విదేశీ మారక నిల్వలు 600 బిలియన్ డాలర్లకు పైనే ఉన్నాయని.. రుణం నుండి GDP నిష్పత్తి తక్కువగా ఉందని వివరించారు. మరోవైపు రెపో రేట్లను పెంచుతూ ఆర్‌బిఐ నిర్ణయం తీసుకోవడంపై స్టాక్ మార్కెట్ నుంచి ప్రతికూల స్పందన వచ్చింది. ఆర్బీఐ నిర్ణయంతో సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ 16,749 దిగువకు పడిపోయింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

two × one =