More

  రిపబ్లిక్ భారత్ – ఎపిసోడ్ 01

  296 మంది ఎన్నుకొబడిన సభ్యులు…
  దాదాపు మూడేళ్ల సమయం…
  12 సార్లు సమావేశాలు…
  167 రోజులకు పైగా చర్చలు
  ఇలా మన భారత్ కు ఒక రాజ్యాంగం ఏర్పడింది.
  మతపరంగా భాషా పరంగా, ప్రాంతాల వారిగా మానసికంగా కులాలపరంగా విడిపోయిన ఈ దేశంలో తొలిసారిగా ఒక సార్వభౌమాధికార దేశంగా ఆవిర్భవించింది. మన భారత రాజ్యాంగానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను నేషనలిస్ట్ హాబ్ మీ ముందుకు ఈ సిరీస్ ద్వారా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది.

  భారత రాజ్యాంగం…చూసేందుకు అది ఒక పుస్తకం కాదు.! నిజానికి ఇది భారత దేశ ఆత్మ…! constitution is supreme law of the land ! రాజ్యాంగం…మన దేశం యొక్క సర్వోన్నత చట్టం !
  మా ఈ పత్ర్యేక కార్యక్రమం లక్ష్యం ఏమిటంటే…, దేశానికి చెందిన ప్రతి ఒక్కరు…అత్యంత ముఖ్యమైన ఈ రాజ్యాంగ ప్రతి గురించి తెలుసుకోవాలి. ప్రతి పేజీలో తమ హక్కులు, విధుల గురించి సులభంగా అర్థం చేసుకోవాలనీ…, వాటిని మరింత విస్తృతంగా అన్వయించుకోవాలనీ మా ఆకాంక్ష!

  మొదట మనం రాజ్యాంగం అంటే ఏమిటో తెలుసుకుందాం.!

  రాజ్యాంగం…! దేశం…, దేశంలోని ప్రభుత్వం…దానికి సంబంధించిన అన్ని విభాగాలు సక్రమంగా పనిచేసేందుకు మార్గనిర్దేషనం చేస్తూ అందుకు శక్తిని ఇచ్చేది. అంతేకాదు ఈ విభాగాల పరిధులను సైతం స్పష్టంగా నిర్దేశించేది. దేశం ఎలా ముందుకు సాగుతుంది? ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది? వ్యవస్థలోని ప్రతి విభాగం తమ కార్యక్రమాలను ఎలా నిర్వహించాలి? ఇలా అన్ని రాజ్యాంగాన్ని అనుసరించే నిర్ణయించడం జరుగుతోంది.

  రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి…, సుప్రీం కోర్టు, రాష్ట్రాల హైకోర్టులు వివిధ సందర్భాల్లో…, ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను సమీక్షించడమే కాదు.., వాటిని రద్దు చేయడం, లేదంటే మార్చివేయడం..మనం చూస్తుంటాం. కోర్టులకు న్యాయ సమీక్షాధికారం ఉంటుంది. పార్లమెంటు కానీ, రాష్ట్రాల శాసన సభలు చేసే చట్టాలు…రాజ్యాంగం పరిధిలో ఉన్నాయా ? లేదా అనే అంశాలను పరిశీలిస్తాయి. దేశానికి సంబంధించి ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా…అది భారత రాజ్యాంగానికి లోబడి మాత్రమే ఉంటుంది.

  ఇక మన రాజ్యాంగం రచన విషయానికి వస్తే…, మొదటిసారిగా ప్రపంచంలో ఎప్పుడైతే శాసనం ద్వారా ప్రభుత్వాలు ఏర్పడ్డాయో…అప్పుడే ఆ శాసనానికి సంబంధించిన నియమ నిబంధనలు రూపొందించడం జరిగిందని చెబుతారు. మన దేశంలో అత్యంత ప్రాచీనమైన వేదాల్లోనూ ఈ ప్రస్తావనలు కనిపిస్తాయి. రుగ్వేదం, అధర్వణవేదంలో సభ-సమితిల ప్రస్తావనలు కనిపిస్తాయి. ఇందులో సభ అనగా సామాన్య ప్రజానీకలనీ, అలాగే మితిలో అధికారులు, పాలన వ్యవస్థలకు సంబంధించిన నియమ నిబంధనల ప్రస్తవనలు కనిపిస్తాయి. ఇంకా కౌటిల్యుడి అర్థశాస్త్రం, పాణిని అష్టాధ్యాయ్, ఐతరేయ బ్రహ్మణం, మనుస్మృతి వంటి ఎన్నో గ్రంథాల్లో రాజ్యపాలన, శాసన వ్యవస్థలకు సంబంధించిన అధికారాల వివరాలు ఉన్నాయి. ఇంకా ప్రాచీన శిలాశాసనాలలో కూడా పాలన అధికారాలకు సంబంధించిన అంశాలు కనిపిస్తాయి.

  స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న సేనానుల్లో చాలా మంది… రాజ్యం-పాలనకు సంబంధించిన అన్ని వ్యవస్థలపై సమగ్రమైన అవగాహన ఉన్నవారే ఉన్నారు. మన దేశంలో రాజ్యం యొక్క ప్రధాన అంగాలకు సంబంధించిన నియమ నిబంధనలు ఉండాలని వారంతా భావించారు. దీనికి భారత ప్రజల చేత ఎన్నుకోబడిన సభ్యులతో కూడిన ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు జరగాలని కోరుకున్నారు. దీని ద్వారా భారత రాజ్యాంగం కోసం సమగ్ర చర్చ జరగాలని…ఆ తర్వాతే అమలులోకి తీసుకుని రావాలని భావించారు. అయితే బ్రిటీష్ ప్రభుత్వం మాత్రం అందుకు ఒప్పుకోలేదు. 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ పేరుతో వారి డిమాండ్లను చల్లార్చే ప్రయత్నం చేశారు ఆంగ్లేయులు. అయితే ఈ యాక్ట్ ను భారతీయులు రూపొందించలేదనే కారణంతో అప్పటి కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది.

  మొత్తానికి రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత భారత దేశానికి స్వాతంత్ర్యం లభించే అవకాశాలు మొరుగయ్యాయి. 1942లో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును క్రిప్స్ మిషన్ కూడా ప్రతిపాదించింది. క్యాబినెట్ సూచన మేరకు రాజ్యాంగ పరిషత్ కోసం 1946 జులైలో ఎన్నికలు నిర్వహించారు. జులైలో మొదలైన ఈ ఎన్నికలు సెప్టెంబర్ వరకు జరిగాయి. 389 మంది సభ్యులు ఎన్నుకోబడినారు. దేశ విభజన తర్వాత వీరి సంఖ్య 296 అయ్యింది. వీరిలో చీఫ్ కమిషనర్ ప్రాంతాల నుంచి ఎన్నికైన సభ్యులు నలుగురు ఉన్నారు. అలాగే స్వదేశీ సంస్థానాల నుంచి ఎన్నికైన సభ్యులు 93 మంది వరకు ఉన్నారు. ఈ సభ్యులు అందరూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి చట్టసభకు ఎన్నికైనవారు.

  1946 నవంబర్ 9న ఉదయం 11 గంటలకు రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం జరిగింది. మొదటి సమావేశానికి డాక్టర్ సచ్చిదానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహారించారు. ఈ సమావేశంలో 211 మంది సభ్యులు పాల్గొన్నారు. అయితే ముస్లింల కోసం ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలనే ప్రస్తావన ఏది లేదనే కారణం చూపేడుతూ ముస్లింలీగ్ సభ్యులు ఈ సమావేశం నుంచి బయటకు వచ్చేశారు.

  1946 డిసెంబర్ 11న డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ ను రాజ్యాంగ పరిషత్తుకు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికున్నారు. షరిషత్ న్యాయ సలహాదారుగా సర్ బి. నర్సింగరావు వ్యవహారించారు. మొత్తం 11 సార్లు సమావేశాలు నిర్వహించారు. మొత్తంగా 165 రోజులపాటు మౌలిక రాజ్యాంగంలోని వివిధ ప్రకరణలు, భాగాలపై చర్చలు జరిగాయి. రాజ్యాంగ పరిషత్ కు సలహాదారుగా వ్యవహారించిన బీఎన్ రావు ప్రపంచంలోని అనేక దేశాల లిఖిత రాజ్యాంగాలను అధ్యయనం చేశారు. యూకే, ఐర్లాండ్,కెనడా, అమెరికా వెళ్లి అక్కడి మేధావులతో విస్తృత చర్చలు జరిపారు. 1947 అక్టోబర్ లో భారత రాజ్యాంగం మొదటి ముసాయిదాను రూపొందించి పరిషత్తుకు సమర్పించారు. డాక్టర్ భీమ్ రావు రాంజీ అంబేద్కర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ఈ ముసాయిదా కమిటీకి అప్పగించారు. నర్సింగ్ రావు సమర్పించిన డ్రాఫ్ట్ ను అంబేద్కర్ నేతృత్వంలోని ముసాయిదా కమిటీ పరిశీలించి…1948 ఫిబ్రవరి 21న తాము రూపొందించిన కొత్త ముసాయిదాను రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడికి సమర్పించింది. ఈ నూతన డ్రాఫ్ట్ లో ప్రజల నుంచి కూడా సలహాలు కోరడం జరిగింది. వీటి ఆధారాంగా ముసాయిదాలో ఎన్నో మార్పులు చేయడం జరిగింది. ఇలా మార్పులు చేయబడిన డ్రాఫ్ట్ ను 1948 నవంబర్ 4న రాజ్యాంగ పరిషత్ ముందు ఉంచింది. ఈ డ్రాప్ట్ లోని అధికరణాలు, విభాగాలపై విస్తృతంగా ఏడాది కాలం పాటు చర్చలు జరిగాయి. రాజ్యాంగంలో ఏ అంశాలు ఉండాలి. ఏవి ఉండకూడదు. వంటి వాటి పై చర్చలు, సవరణలు జరిగాయి. మొత్తానికి 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ ముసాయిదాను ఆమోదించింది. రాజ్యాంగ పరిషత్ ఛైర్మన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ సంతకం చేశారు. దీంతో ఇక ఈ ముసాయిదా కాస్తా… భారత రాజ్యాంగంగా…, చట్టంగా మారిపోయింది.

  1950 జనవరి 26న రాజ్యాంగ పరిషత్ చివరిసారిగా సమావేశం జరిగింది. ఈ చివరి సమావేశంలోనే జాతీయ గీతంగా జనగణమన…,జాతీయ గేయంగా వందేమాతరం గీతమును ఆమోదించారు. మొత్తానికి 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం దేశంలో పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చింది.

  రాజ్యాంగ పరిషత్ సలహాదారుగా వ్యవహారించిన బి.నర్సింగరావు దాదాపు ఏడు దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేశారు. అలాగే డాక్టర్ బీమ్ రావు రాంజీ అంబేద్కర్ తోపాటు…మిగిలిన సభ్యులకు కూడా వివిధ దేశాలకు సంబంధించి వాటి రాజ్యాంగాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. దీంతో వాటిలోని ముఖ్యమైన అంశాలు సైతం భారత రాజ్యాంగంలోనూ ఉండాలని భావించారు.

  భారత రాష్ట్రపతిని రాజ్యాంగ సంరక్షకుడిగా..,అలాగే భారత సైనిక దళాల సుప్రీం కమాండర్ అనే భావనను అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించారు. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు, సమాఖ్య విధానం, కేంద్రం గవర్నర్లను నియమించే పద్ధతిని కెనడియన్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. ఏక పౌరసత్వం, క్యాబినెట్ తరహా పార్లమెంటరీ విధానం, పార్లమెంటుకు మంత్రిమండలి జవాబుదారిగా ఉండటం వంటి అంశాలను బ్రిటన్ నుంచి స్వీకరించారు. 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన, ద్విసభా విధానాన్ని స్వీకరించడం జరిగింది.

  Trending Stories

  Related Stories