రేణుకా చౌదరిపై కేసు నమోదు.. ఆమె చెబుతోంది ఇదే..!

0
825

రాజ్‌భవన్ ముట్టడిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు అదుపుచేస్తున్న సమయంలో ఆమె ఎస్‌ఐ ఉపేంద్ర కాలర్ పట్టుకున్నారు. దాంతో ఆమెపై ఎస్‌ఐ ఉపేంద్ర ఫిర్యాదు చేశారు. రాజ్ భవన్ ముట్టడి సమయంలో పోలీసులకు, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరికి మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. ఈ క్రమంలో రేణుక చౌదరిని మహిళా పోలీసులు చుట్టుముట్టారు. వాగ్వాదానికి దిగిన రేణుక పోలీస్ స్టేషన్‌కు వచ్చి కొడతానని ఎస్.ఐకి వార్నింగ్ ఇచ్చింది. ఎస్.ఐ కాలర్ పట్టుకుని రేణుక ప్రశ్నించడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఈ మేరకు రేణుకా చౌదరిపై 353 సెక్షన్‌ కింద కేసు నమోదు అయింది. విధి నిర్వహణలో ఉన్న పోలీస్‌ కాలర్ పట్టుకోవడంపై రేణుకా చౌదరిపై కేసు ఫైల్ చేశారు.

ఎస్సై ఉపేంద్రబాబు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో రేణుకా చౌదరిపై ఫిర్యాదు చేయడంతో ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు గోల్కొండ పీఎస్ కు తరలించారు. ఈ ఘటనపై రేణుకా చౌదరి మాట్లాడుతూ.. పోలీసు యూనిఫాం అంటే ఏంటి, ఎలా గౌరవించాలనేది మాకూ తెలుసన్నారు. అదే సమయంలో పోలీసులు మాకు కూడా గౌరవం ఇవ్వాలి. నా చుట్టూ ఎందుకు మగ పోలీసులను మోహరించారో చెప్పాలని ప్రశ్నించారు. పోలీసులపై దాడి చేయాలని నాకెలాంటి ఉద్దేశం లేదు. నన్ను నెట్టివేసేందుకు ప్రయత్నించడంతో అదుపుతప్పి పోలీసులపై పడిపోయాను. కావాలంటే విజువల్స్ చూడండి. నన్ను నెట్టివేయడంతో ఆసరా కోసం అతడి భుజాన్ని పట్టుకునే ప్రయత్నం చేశాను… అంతేతప్ప ఉద్దేశపూర్వకంగా అతడి కాలర్ పట్టుకోలేదు. వీడియో చూస్తే స్పష్టంగా తెలుస్తుందని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు.