National

దటీజ్ మోదీ సర్కార్.. ఒక్క నెలలోనే పదింతల ఉత్పత్తి పెంచేసింది

రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు.. భారతదేశంలో ఈ ఇంజెక్షన్ల కొరత ఎంతగానో వేధించింది. చాలా మంది బ్లాక్ మార్కెట్ లో ఈ ఇంజెక్షన్లను కొనాలని తీవ్రంగా ప్రయత్నించారు. అసలు రేటు కన్నా ఎన్నో రెట్లు చెల్లించి మరీ కొనుక్కున్నారు. ఇంకొందరు కావాలనే ఈ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్ కు తరలించారు. అలాంటి గ్యాంగులను అధికారులు పట్టుకొని.. జైలుకు పంపించారు. ఈ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకుంది. దేశంలో ఈ ఇంజెక్షన్ల కొరత ఉండకుండా చూసుకోడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంది. కేవలం నెల రోజుల్లో కావాల్సిన ఇంజెక్షన్ల కంటే ఎక్కువగానే తయారు చేయడం మొదలు పెట్టింది.

కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి మన్సూఖ్ మాండవ్య మాట్లాడుతూ రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల ఉత్పత్తి నెల రోజుల వ్యవధిలోనే 10 రెట్లు పెరిగిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోనే ఇది సాధ్యమైందని అన్నారు. ఒకప్పుడు 33000 వయల్స్ ను రోజుకు ఉత్పత్తి చేసే వారని.. మే నెలలో రోజుకు 3,50,000 ఇంజెక్షన్లను ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగామని అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 11 నాటికి దేశంలో రోజుకు 33 వేల రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు ఉత్పత్తి చేయగా, ఇప్పుడది పదింతలు పెరిగి రోజుకు 3.5 లక్షల ఇంజెక్షన్లు తయారుచేసే స్థాయికి చేరిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం ఒక్క నెలలోనే రెమ్ డెసివిర్ ఉత్పత్తి కేంద్రాల సంఖ్యను 20 నుంచి 60కి పెంచిందని అన్నారు. దేశంలో డిమాండ్ ను మించిపోయేలా రెమ్ డెసివిర్ ఉత్పత్తి జరుగుతోందని మన్సూఖ్ మాండవ్య తెలిపారు.

డిమాండ్ కంటే లభ్యత ఎక్కువగా ఉన్నందున రాష్ట్రాలకు రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల కేటాయింపులను కేంద్రం నిలిపివేస్తోందని తెలిపారు. దేశంలో రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల లభ్యత, ఇతర అంశాలను జాతీయ ఫార్మా ధరల నియంత్రణ సంస్థ, సీడీఎస్ సీఓ పర్యవేక్షించాలని అన్నారు. కేంద్రం తన వద్ద 50 లక్షల వయల్స్ ను నిల్వ ఉంచుకుంది. ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తితే వాటిని రాష్ట్రాలకు అందిస్తామని అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × 1 =

Back to top button