వనమా రాఘవకు 14 రోజుల రిమాండ్

0
893

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. భద్రాద్రి జిల్లాలోని దమ్మపేట మీదుగా వాహనంలో ఏపీ వైపు పరారవుతున్న రాఘవను చింతలపూడి వద్ద గత రాత్రి పదిన్నర గంటల సమయంలో పట్టుకున్నారు. రాఘవను ఎస్పీ కార్యాలయంలో విచారించిన అనంతరం నేడు కోర్టులో హాజరుపరిచారు. విచారించిన అనంతరం పోలీసులు కొత్తగూడెంలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అతనికి న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. పోలీసులు అతనిని భద్రాచలం జైలుకు తరలించారు. రామకృష్ణను బెదిరించినట్టు రాఘవ అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు.గతంలో అతడిపై 11 కేసులు ఉన్నట్టు ఏఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో రాఘవతో పాటు 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాఘవతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేయగా, మిగిలినవారు పరారీలో ఉన్నారు.

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఆత్మహత్యకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవ కారణమని.. రామకృష్ణ సూసైడ్ నోట్ రాయడంతో పాటు వీడియో కూడా రికార్డు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. వనమా రాఘవను పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. భద్రాద్రి జిల్లాలోని దమ్మపేట మండలం మందలపల్లి, ఏపీ సరిహద్దు ప్రాంతం చింతలపూడి మధ్య రాఘవను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాఘవతోపాటు డ్రైవర్, అతని సహకరించిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.