రిలయన్స్ కు కొత్త వారసులు రాబోతున్నారా..?

0
872

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అధికారంలో మార్పును అతి త్వరలోనే చూడబోతున్నాము. రిలయన్స్ ఇండస్ట్రీస్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ చెబుతూ.. తన వారసులకు వ్యాపార సామ్రాజ్యాన్ని అప్పగించబోతున్నట్టు ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. తన తండ్రి ధీరూభాయి అంబానీ వర్ధంతిని కుటుంబ వేడుక (ఫ్యామిలీడే)గా ఏటా ముకేశ్ జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, సీనియర్ సహోద్యోగులతో పాటు యువ తరానికి పగ్గాలను అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. “పెద్ద కలలు, అసాధ్యమైన లక్ష్యాలను సాధించడానికి సరైన వ్యక్తులను నియమించడం.. సరైన నాయకత్వం అందించడం అవసరం” అని అంబానీ చెప్పడంతో.. రిలయన్స్‌లో గణనీయమైన నాయకత్వ మార్పు మొదలవుతుందని.. తనతో పాటు, సీనియర్‌ వ్యక్తులు యువ నాయకులు అందరినీ మార్చే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు అంబానీ. రూ.18 లక్షల కోట్ల మార్కెట్ విలువతో, దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనసాగుతోంది. దీనికింద రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్, ఆయిల్, గ్యాస్, పెట్రోకెమికల్, క్లీన్, రెన్యువబుల్ ఎనర్జీ వ్యాపారాలు ఉన్నాయి.

‘‘ఆకాశ్, ఈషా, అనంత్ సామర్థ్యాలపై నాకు ఎటువంటి సందేహం లేదు. ధీరూభాయి అంబానీ మాదిరే వారిలోనూ మంచి చురుకుదనం, సామర్థ్యాలు ఉన్నాయి. రిలయన్స్ ను మరిన్ని ఉన్నత శిఖరాలకు వారు తీసుకెళతారు. పెద్ద కలలు, అసాధ్యంగా కనిపించే లక్ష్యాలను సాధ్యం చేయాలంటే అది సరైన వ్యక్తులు, సరైన నాయకత్వంతోనే సాధ్యం. రిలయన్స్ లో ప్రతిభా పాటవాలు కలిగిన యువ నాయకత్వానికి కొదవ లేదు. నాయకత్వ మార్పుపై కసరత్తు జరుగుతోంది. ఇతర సీనియర్లతో కలసి దీన్ని వేగవంతం చేస్తాం’’అని ముకేశ్ అంబానీ తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అంతర్జాతీయంగా దిగ్గజ బహుళజాతి కంపెనీగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. క్లీన్ ఎనర్జీలో మేటి సంస్థగా అవతరిస్తుందన్నారు. గొప్ప కలలను సాకారం చేసుకునేందుకు, లక్ష్యంపై చూపుతో ముందుకు వెళ్లేందుకు సరైన వ్యక్తులు, సరైన నాయకత్వం అవసరం, రిలయన్స్ ప్రస్తుతం ఒక కీలక దశలో మార్పు దిశగా అడుగులు వేస్తోందని ముఖేష్ అంబానీ వ్యాఖ్యలు చేశారు.