More

    రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితి సింగ్ బీజేపీ లోకి..!

    కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యే అదితి సింగ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీపై అదితి సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. రాయ్‌బరేలీకి ప్రాతినిధ్యం వహిస్తున్న 34 ఏళ్ల అదితి సింగ్ 2017లో UP శాసనసభకు ఎన్నికయ్యారు. ఆమె ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దివంగత అఖిలేష్ సింగ్ కుమార్తె. ఆమె కాంగ్రెస్ నాయకురాలైనప్పటికీ, అనేక సందర్భాల్లో కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించడంతోపాటు ఉత్తరప్రదేశ్ బీజీపీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఆమె కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని కూడా తీవ్రంగా విమర్శించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై ప్రియాంక గాంధీ స్పందించినందుకు గత వారం ఆమె విమర్శించారు. “బిల్లులు తీసుకువచ్చేటప్పుడు ప్రియాంక గాంధీకి సమస్య వచ్చింది. చట్టాలు (వ్యవసాయ చట్టాలు) రద్దు చేయబడినప్పుడు ఆమెకు ఒక సమస్య ఉంది. ఆమెకు ఏం కావాలి? ఆమె స్పష్టంగా చెప్పాలి. ఈ విషయాన్ని ఆమె రాజకీయం చేస్తోంది. ఆమె ఇప్పుడు రాజకీయం చేయడానికి సమస్యలు లేకుండా పోయాయి” అంటూ అదితి సింగ్ తీవ్ర విమర్శలు చేశారు.

    అదితి సింగ్ ఉత్తరప్రదేశ్ శాసనసభలో బీజేపీకి మద్దతు తెలిపింది. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ ఉండడంతో ఆమెను మహిళా విభాగం నుండి కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. ఆర్టికల్ 370 రద్దుకు కాంగ్రెస్ వ్యతిరేకిస్తూ ఉంటే ఆమె మద్దతు పలికింది. 2020లో యూపీ అసెంబ్లీని బహిష్కరించాలని పిలుపునిచ్చిన తర్వాత ఆమె అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ కోరింది. అయితే ఆ అభ్యర్థనను స్పీకర్ తిరస్కరించారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు అదితి త్వరలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని వివాహం చేసుకోనుందని పుకార్లు వచ్చాయి. అయితే అదితి సింగ్ పుకార్లను కొట్టివేస్తూ “ఇలాంటి పుకార్లు నన్ను కలవరపరిచాయి. రాహుల్ జీ నా రాఖీ సోదరుడని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. సోషల్ మీడియాలో ఇటువంటి పుకార్ల పట్ల నేను నిజంగా బాధపడ్డాను” అంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు.

    Know About Congress Mla Aditi Singh. - Who Is Aditi Singh: भाजपा की लहर के  बावजूद 2017 में 90 हजार वोटों जीतीं थीं, बाहुबली अखिलेश सिंह की बेटी हैं  अदिति सिंह -

    Trending Stories

    Related Stories