More

    రాజకీయాల్లోకి అందుకే వచ్చానని చెప్పిన యోగి ఆదిత్యనాథ్

    మాఫియాతో పోరాడటం, శాంతిభద్రతలను పునరుద్ధరించడం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో యోగి ఆదిత్యనాథ్ అత్యంత విజయవంతమైన ముఖ్యమంత్రులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ‘డెస్టినేషన్ ఉత్తరప్రదేశ్’ కాన్క్లేవ్‌లో, యోగి ఆదిత్యనాథ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ, 1994లో గోరక్ష్ పీఠ్ వారసుడిగా నియమితులైన తర్వాత తాను రాజకీయాల్లోకి రావడానికి కారణమేమిటో బయటపెట్టారు. గోరఖ్ పూర్ మఠాధిపతిగా ఉన్న తనను రాజకీయాల వైపు నడిపించిన పరిస్థితులు, యూపీలో తాజా రాజకీయ వాతావరణంపై చెప్పుకొచ్చారు.

    ఉత్తరప్రదేశ్ లో జరిగిన రెండు సంఘటనలే తాను రాజకీయాల్లోకి వచ్చేలా చేశాయని తెలిపారు. 1994-1995లో గోరఖ్‌పూర్‌లో రెండు పెద్ద భవనాలు ఉండే పేరున్న కుటుంబం ఉండేదని ఆయన అన్నారు. ఆ హవేలీలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, పరిపాలన ఏకపక్షంగా మాఫియాకు కేటాయించింది. యోగి ఆదిత్యనాథ్ ఆ కుటుంబాన్ని కలిసినప్పుడు, వారు రెండు హవేలీలను కూల్చివేసినట్లు చెప్పారు. ఎందుకు అని అడిగినప్పుడు, వారు తమ ఆస్తిని కూల్చివేసామని.. అలా చేస్తే కనీసం భూమిని నిలుపుకోగలుగుతామని అనుకున్నట్లు చెప్పారు. వారు భవనాలను కూల్చివేయకపోతే, మాఫియా భవనాలను, భూమిని స్వాధీనం చేసుకునేదని.. అప్పుడు వారికి ఏమీ లేకుండా పోయేదని అన్నారు.

    యోగి ఆదిత్యనాథ్ చెప్పిన మరో సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఓ మంత్రికి సంబంధించినది. యోగి ఆదిత్యనాథ్ ఆ మంత్రి పేరు చెప్పనప్పటికీ.. ఒక రోజు, ఒక ధనిక కుటుంబం నుండి తమకు ఫోన్ వచ్చిందని, తమ ఆస్తులను మంత్రి ఆక్రమిస్తున్నారని చెప్పారు. యోగి అక్కడికి చేరుకున్నప్పుడు, వస్తువులు ఇంట్లో నుండి విసిరివేయబడింది. ఘటన చోటు చేసుకున్న ప్రాంతం చుట్టూ చాలా మంది వ్యక్తులు నిలబడి ఉన్నారు, కానీ ఏమీ చేయకుండా చూస్తూ ఉన్నారు. యజమాని తన ఆస్తిని వారికి అమ్మలేదు, అయినా మీరు దీన్ని ఎలా చూస్తూ ఉంటారని యోగి ఆదిత్యనాథ్ మాఫియా నాయకులను అడిగినప్పుడు, మాఫియా ఆయన ముఖంపై కొన్ని కాగితాలను విసిరారు. ఆ సమయంలోనే యోగి ఆదిత్యనాథ్ జనాలలో ఆవేశాన్ని తీసుకుని వచ్చారు.

    ఈ రెండు సంఘటనలు… లాంటి అనేక సంఘటనలు.. యోగి ఆదిత్యనాథ్ జీవితాన్ని మార్చేశాయి.. రాజకీయాల్లోకి వచ్చేలా చేశాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో ఎవరూ అలాంటి కార్యకలాపాలు నిర్వహించలేరని.. అక్రమంగా ఏదైనా ఆస్తిని ఆక్రమిస్తే బుల్‌డోజర్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని మాఫియాకు తెలుసునని ఆయన చెప్పారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 350 సీట్ల కంటే తక్కువ రావని నేను నమ్ముతున్నాను. యూపీలో సాధించిన విజయాలన్నీ కూడా ప్రధాని మోదీ నాయకత్వ స్ఫూర్తితోనే సాధ్యమయ్యాయని అన్నారు యోగి. మాఫియా అన్నది మాఫియానే.. దాన్ని కులం, మతం, రాజకీయాలతో ముడిపెట్టలేమని.. వారు సమాజానికి శత్రువులని అన్నారు. మాఫియా కరోనావైరస్ కంటే ఘోరమైనదని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

    Trending Stories

    Related Stories